Site icon Prime9

Traffic Rules: బండి నెంబర్ ప్లేట్ సరిగ్గా లేదా?.. మీరు కోర్టు మెట్లెక్కాల్సిందే

traffic rules

traffic rules

Traffic Rules: ట్రాఫిక్ నియమాలు పాటించని వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు విధించే చలాన్లను తప్పించుకునేందుకు కొందరు వివిధ మార్గాలను అనుసరిస్తారు. కొందరు వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా.. మరి కొందరు వాహనాల నెంబర్ కనిపించకుండా చేస్తారు. ఇక అలాంటి వారిపై ట్రాఫిక్ పోలీసులు కొరఢా ఝళిపిస్తున్నారు. సరిగ్గా లేని నెంబర్ ప్లేట్ వాహనంతో మీరు రోడ్డుక్కెతున్నారా.. అయితే మీరు కోర్టు మెట్లు ఎక్కాల్సిందే అంటూ వాహనాదారులకు సూచిస్తున్నారు.

సరిగ్గా నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై రాచకొండ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

వాహనాలపై నెంబర్ ప్లేట్స్ లేకుండా.. నెంబర్లను టాంపరింగ్ చేసిన అలాంటి వాహనాలపై వాహన చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

రాచకొండ పరిధిలోని ఎనిమిది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో.. షిఫ్టుల వారిగా 233మంది సిబ్బందితో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు.

ఈ తనిఖీల్లో భాగంగా.. ఇప్పటి వరకు 149 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 815 వాహనాలకు జరిమానా విధించారు.

కొందరు వాహనాల నెంబర్ కనిపించకుండా.. వాటికి మాస్కులు పెట్టడం చేస్తున్నారు.

మరికొందరు వాహన నెంబర్ ప్లేట్లను సగానికి వంచి తప్పించుకుంటున్నారు.

ఇలాంటి వాహనాలను గుర్తించి.. వారిపై చట్టపరమైన చర్యలు Hyderabad Traffic Rules  తీసుకోవడం జరగుతుందని పోలీసులు తెలిపారు.

కొందరు చైన్ స్నాచర్లు.. రాత్రిపూట దొంగతనం చేసేవారు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఇలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారు.

వాటిని నియంత్రించేందుకు సైతం పోలీసులు  కృషి చేస్తున్నారు.

రోడ్డు మీదకు వచ్చేటపుడు వాహనల నెంబర్ ప్లేట్స్ సరిగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలని రాచకొండ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

తనిఖీల్లో నెంబర్ ప్లేట్స్ సరిగా లేని వాహనాలు దొరికితే… 420 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేస్తామన్నారు.

అనంతరం కోర్టులో హాజరు పరుస్తామని రాచకొండ  డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

పవన్ ని తిట్టి తప్పు చేశా..! | Byreddy Siddharth Reddy | Pawan Kalyan | Prime9 News

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar