Site icon Prime9

Tollywood Singers Marriage: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్‌ స్టార్‌ సింగర్స్‌ – షాక్‌ అవుతున్న ఫ్యాన్స్‌

Singers Anurag Kulkarni and Ramya Behara Marriage Photos: టాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌ అనురాగ్‌ కులకర్ణి సీక్రెట్‌ పెళ్లి చేసుకుని షాకిచ్చాడు. గాయని రమ్మ బెహరాతో సీక్రెట్‌ పెళ్లి పీటలు ఎక్కాడు. వీరిద్దరి పెళ్లి ఫోటోలు బయటకు రావడంతో అంతా సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. కాగా ‘అభినేత్రి అభినయ నేత్రి’ అంటూ మహానటిలో పాట ఎంతోమంది సంగీత ప్రియులను ఆకట్టుకున్నాడు అనురాగ్‌. దీంతో ఒక్కసారి అతడి ఇండస్ట్రీలో మారుమోగింది. దీంతో అగ్ర హీరోలు, పెద్ద సినిమాల్లో అనురాగ్‌కి కచ్చితంగా ఒక పాట ఉంటుంది.

తాజాగా ఈ యంగ్‌ సింగర్‌ గాయనీ రమ్మ బెహరాను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న సింగర్స్‌. ముందుగా ఎలాంటి ప్రకటన లేకుండ వీరిద్దరు వివాహ బంధంలోకి అడుపెట్టడం ఫ్యాన్స్‌ని షాక్‌ గురి చేసింది. ఏదేమైన ఈ ఇద్దరు ఒక్కటి కావడంతో తోటి సింగర్స్‌, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక వీరిద్దరి ప్రేమ వివాహం అని తెలుస్తోంది. సైలెంట్‌గా ప్రేమాయణం నడిపి పెద్దల సమక్షంలో ఇద్దరు ఒక్కటయ్యారు. ఎన్నో హిట్స్‌ సాంగ్స్ పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరు ఇటీవల అమరన్‌ చిత్రంలో కలిసి పాడారు. ‘హే రంగులే’ పాట పాడింది వీరే. ఈ పాట ఎంతగా హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కాగా సూపర్‌ సింగ్‌ 8వ తన పాటలతో మెప్పించిన విజేతగా నిలిచాడు అనురాగా. ఆ తర్వాత ‘కేరాఫ్‌ కంచలపాలెం’లోని ఆశా పాశం పాటతో పాటు ఆర్ఎక్స్ 100లో పిల్లరా పాటతో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇక మహనటిలో అభినేత్ర అభినేత్రి అంటూ అతడు పాడిన పాట మారుమోగింది. తనదైన గాత్రంతో శ్రోతలను ఆకట్టుకుంటూ తక్కువ టైంలోనే స్టార్‌ సింగర్‌గా ఎదిగాడు. ఇక రమ్య బెహరా విషయానికవ వస్తే ఈమె కూడా సూపర్‌ సింగర్‌ నుంచే వచ్చింది. సూపర్‌ సింగర్ 4లో పాల్గొన్న ఈమెను ఎమ్‌ఎమ్‌ కీరవాణి ఇండస్ట్రీకి పరిచయం చేశారు. టెంపర్, బాహుబలి, ప్రేమకథా చిత్రం, లౌక్యం, ఒక లైలా కోసం, ఇస్మార్ట్‌ శంకర్‌ వంటి చిత్రాల్లో రమ్య పాటలు పాడి మంచి హింట్స్‌ అందుకుంది.

Exit mobile version