Site icon Prime9

Passion Movie: ‘పేషన్’ మూవీ ఓ ఎమోషన్, ఫ్యాషన్‌.. శేఖర్ కమ్ముల

Tollywood New Movie Passion First Look

Tollywood New Movie Passion First Look

Tollywood New Movie Passion First Look Released by Director Sekhar Kammula: టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో సుధీస్, హీరోయిన్ అంకిత నటించిన లేటెస్ట్ మూవీ ‘పేషన్’. ఈ సినిమాకు అరవింద్ జాషువా దర్శకత్వం వహించగా.. REDANT క్రియేషన్ బ్యానర్‌పై నరసింహ యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ నిర్మించారు. తాజాగా, ఈ సినిమా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను స్టార్ డైరెక్టర్ శేకర్ కమ్ముల చేతుల మీదుగా విడుదల చేయించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ఈ సినిమా ఇంటెన్స్ ఎమోషన్స్ ఉన్న ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ అని పేర్కొన్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూడాగానే చాలా మంచిగా అనిపించిందని, ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్నారు.

 

ఆనంద్ సినిమా నుంచి అరవింద్ జాషువా తెలుసని, అతను రాసే కథలో మంచి క్రియేటర్ ఉన్నాడని చెప్పారు. ఆయన పేషన్ అని ఓ నవల రాశారని, ఆ నవలను చదువుతున్న సమయంలో చాలా మంచి ఉందన్నారు. అందులో ఫ్యాషన్ బ్యాక్ గ్రౌండ్ గురించా రాయడం చాలా నచ్చిందన్నారు. అందుకే దీనిని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్‌ అని అంటున్నానన్నారు. ఇక స్టోరీ స్క్రిప్ట్ బాగుందన్నారు. ఇందులో అందరూ కొత్తవాళ్లే ఉన్నారని, ఫ్యాషన్‌తో సినిమా తీశారని చెప్పారు. ఇలాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారన్నారు. అనంతరం సినిమా బృందానికి అభినందనలు తెలిపారు.

 

ఆ తర్వాత ఈవెంట్‌కు హాజరైన ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాట్లాడారు. సినిమా కంటే ముందు నవలగా ముందుకు తెచ్చిన పబ్లికేషన్స్‌కు ధన్యవాదాలు. ఈ నవల చదివి చాలామంది ఫాలో అయ్యారని చెప్పారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఆశీర్వాదాలు లేకుంటే ఈ మూవీ ఇంతవరకు వచ్చేది కాదని గుర్తు చేశారు.ఈ సినిమాకు అండగా నిలిచినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మూవీ మంచి హిట్ సాధించాలని కోరుకున్నట్లు చెప్పారు.

 

ఇక, ఈ సినిమా కాన్వాస్ చాలా పెద్దదని డైరెక్టర్ అరవింద్ అన్నారు. ఉన్నత కుటుంబంలోని పిల్లలు చదువుతున్న ఓ ఫ్యాషన్ కాలేజీలో నాలాంటి మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్థి చదివితే ఎలా ఉంటుందోనని ఊహించి రాసినట్లు చెప్పారు. శేఖర్ కమ్ముల శిష్యుడిగా 20 ఏళ్లు జర్నీ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఆయన పేసన్ చూసి చాలా గౌరవం పెరిగిందన్నారు.నిర్మాతలు అండగా నిలిచారని, నవలగా విడుదల చేసేందుకు సహకరించిన ఛాయా పబ్లికేషన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. డీఓపీ సురేష్ నటరాజన్, మ్యూజిక్ హోర్నీ, ఎడిటర్ నాగేశ్వర రెడ్డిచ ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీకాంత్, నటీనటులు అందరూ బాగా చేశారన్నారు. ఇందులో ప్రకాష్ రాజ్, హిమజ అశ్విన్ ముశర్న్, బెనర్జీ, చందన, అర్చన, ఉదయ్ మహేష్, సూర్య, కన్నడ కిషోర్, యుక్త, అర్జున్, శ్రేయషి, పరిణిత, అన్షుల, అర్జున్, అంకిత్ తదితరులు నటించారన్నారు.

Exit mobile version
Skip to toolbar