Site icon Prime9

Stock Market: మీరు ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారా.. అయితే ఈ రోజు మీకు లాభాలే..!

Stock market latest updates

Stock market latest updates

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లైన సెన్సెక్స్, నిఫ్టీలు మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 1,180 పాయింట్లకుపైగా లాభాల్లో ఉండగా, నిఫ్టీ 360 పాయింట్ల వృద్ధితో ట్రేడవుతున్నది.

ప్రస్తుతం సెన్సెక్స్‌ 57,986.87, నిఫ్టీ 17,254.35 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాల వీచడం వల్ల నేడు దేశీయ స్టాక్స్ భారీ లాభాలను నమోదు చేశాయి. కాగా నేడు దాదాపు అన్నిరంగాల్లోని షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సుమారుగా 1633 షేర్లు లాభాల్లో ఉండగా 250 షేర్లు నష్టాలు కనపరుస్తున్నాయి. బీఎస్‌ఈలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఇన్ఫోసిస్‌, రిలయ్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ వంటివి లాభాల్లో కొనసాగుతున్నాయి. కాగా నిఫ్టీలో హిందాల్కో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫినాన్స్‌, లార్‌సెన్‌, టీసీఎస్‌లు టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. ఇదిలా ఉండగా పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి: రూ. 15వేలకే జియో ల్యాప్ టాప్..!

Exit mobile version
Skip to toolbar