Site icon Prime9

MLC Sipai Subramanyam: ఎమ్మెల్సీ కిడ్నాప్ వార్తలు.. ఎన్నికల్లో ఆయన ఓటే కీలకం.. 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్‌

Tirupati Deputy Mayor Election Issue MLC Sipai Subramanyam Missing News: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షెడ్యూల్ ప్రకారం.. సోమవారం జరగాల్సిన డిప్యూటీ మేయర్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. మొత్తం 50 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నాయి. కానీ సోమవారం ఓటింగ్‌కు 22 మంది మాత్రమే హాజరయ్యారు. 50 శాతం కోరం లేనందున డిప్యూటీ మేయర్ ఎన్నికను వాయిదా వేశారు.

అయితే డిప్యూటీ మేయర్ ఎన్నిక పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ కూటమితో పాటు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంను టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. అర్ధరాత్రి ఆయనను తన నివాసం నుంచి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. కాగా, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉన్న సుబ్రమణ్యం ఓటు కీలకం కానుంది.

ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కిడ్నాప్ అంటూ వస్తున్న వదంతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వీడియోను సుబ్రమణ్యం విడుదల చేశారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరానని సుబ్రమణ్యం ప్రకటించారు. తనను కిడ్నాప్ చేశారని వదంతులు సృష్టించొద్దని కోరారు. కాగా, తిరుపతి నగరపాలక సంస్థలో సుబ్రమణ్యం కో ఆప్షన్ సభ్యుడిగా ఉన్నారు.

ఇదిలా ఉండగా, తిరుపతి ఎమ్మెల్సీ కిడ్నాప్ అయ్యారని జరుగుతున్న ప్రచారంపై జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పందించారు. ఎమ్మెల్సీని ఎవరూ కిడ్నాప్ చేయలేదని వివరించారు. ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు ఆయనే వీడియో విడుదల చేశారు. కాగా, తిరుపతిలో లా అండ్ ఆర్దర్ కంట్రోల్‌లోనే ఉందన్నారు. తిరుపతిలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్‌తో పాటు బందోబస్త్ పెంచామన్నారు. అలాగే బాలాజీ కాలనీ నుంచి ఎస్వీయూ వరకు వాహనాలను మళ్లించామని ఎస్పీ స్పష్టం చేశారు.

Exit mobile version