Site icon Prime9

TTD: సెప్టెంబర్ 27 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Tirumala: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులందరూ మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. భక్తుల కోసం తిరుమల, అలిపిరిలో తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేసినట్టు వివరించారు.

ఈ సారి భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో పకడ్బంధీగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మొదటి రోజు ముఖ్యమంత్రి రాష్ట్రప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉచిత బస్సు సర్వీసులతో పాటు 24 గంటలు కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందని సుబ్బారెడ్డి అన్నారు.

Exit mobile version