Site icon Prime9

Nallakunta Red Cross Blood Bank Center: తలసేమియా బాధిత బాలుడికి హెచ్‌ఐవీ పాజిటివ్

Hyderabad: హైదరాబాద్ నల్లకుంటలో దారుణం జరిగింది. తలసేమియా బాధిత బాలుడికి హెచ్‌ఐవీ పాజిటివ్ వచ్చింది. రెండున్నరేళ్లుగా నల్లకుంటలోని రెడ్‌క్రాస్‌ బ్లడ్‌బ్యాంక్‌లో బాలుడికి రక్త మార్పిడి చేయిస్తున్నారు. బాలుడికి హెచ్‌ఐవీ పాజిటివ్ రావడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. అనుమానంతో బాలుడి తల్లిదండ్రులకు హెచ్‌ఐవీ పరీక్ష నిర్వహించగా, నెగటివ్ వచ్చింది. నల్లకుంట రెడ్‌క్రాస్‌ బ్లడ్‌బ్యాంక్‌ నిర్లక్ష్యం వల్లే తమ బాబుకు హెచ్‌ఐవీ వచ్చిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

Exit mobile version