OTT Release Movies and Web Series : ప్రస్తుతం థియేటర్‌లో ఈ వారం స్టార్ హీరోల సినిమాలేవీ సందడి చేయడం లేదు. మరోవైపు ఓటీటీలో మాత్రం ఆసక్తికర వెబ్ సిరీస్‌లు, సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పలు భాషల్లోని సినిమాలు, వెబ్ సిరీస్ ల వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
రానా నాయుడు..
దగ్గుబాటి వెంకటేష్, రానా తండ్రీ కొడుకులుగా నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ద్వారా మార్చి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటు వెంకటేశ్, అటు రానాకు ఇదే తొలిసారి వెబ్ సిరీస్. ఇందులో వెంకటేశ్ నాగా నాయుడుగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సిరీస్‌పై ఆసక్తిని పెంచుతున్నాయి. ‘రే డొనొవాన్’ టీవీ సిరీస్ ఆధారంగా భారతీయ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ‘రానా నాయుడు’ను తీర్చిదిద్దారు.
యాంగర్ టేల్స్..
దర్శకుడు వెంకటేశ్ మహా, సుహాస్, బిందు మాధవి, మడోనా సెబాస్టియన్, రవీంద్ర విజయ్, ఫణి ఆచార్య కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘యాంగర్ టేల్స్’ (Anger Tales). ప్రభల తిలక్ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ మార్చి 9వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఎన్నో ఆశలతో ఉన్న నలుగురికి.. వారికి నచ్చని జీవితం ఎదురైతే వారి మానసిక సంఘర్షణ ఏంటి? దాని వల్ల వారి జీవితాల్లో చోటు చేసుకున్న పరిణామాలేంటి? అన్న ఆసక్తికర అంశాలతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. నటుడు సుహాస్ ఈ సిరీస్‌ను నిర్మిస్తుండటం విశేషం.
క్రిస్టఫర్..
వైవిధ్య కథలతో ప్రేక్షకులను అలరిస్తోంది మలయాళ చిత్ర పరిశ్రమ. మమ్ముట్టి కీలక పాత్రలో బి.ఉన్ని కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘క్రిస్టఫర్ ’. గత నెలలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మార్చి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
రన్ బేబీ రన్..
ఆర్జే బాలాజీ, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన తమిళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘రన్ బేబీ రన్’. జెయీన్ కృష్ణకుమార్ దర్శకుడు. ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు డీస్నీ+హాట్‌స్టార్ వేదికగా తమిళంతో పాటు, తెలుగు లోనూ విడుదల కానుంది. మార్చి 10వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీలో విడుదల కాబోతున్న మరికొన్ని చిత్రాలు,వెబ్ సిరీస్‌ల లిస్ట్..
నెట్‌ఫ్లిక్స్..
ఎంహెచ్ 370 (డ్యాకుమెంటరీ సిరీస్) స్ట్రీమింగ్ అవుతోంది.
యు (హాలీవుడ్) మార్చి 9
రేఖ (మలయాళ చిత్రం) మార్చి 10
ద గ్లోరీ (వెబ్‌సిరీస్2) మార్చి 10
లూథర్ (టీవీ సిరీస్) మార్చి 10
అవుట్ లాస్ట్ (టీవీ సిరీస్) మార్చి 10
అమెజాన్ ప్రైమ్..
హ్యాపీ ఫ్యామిలీ – కండీషన్స్ అప్లయ్ (హిందీ సిరీస్) మార్చి 10
దాదా (తమిళ్) మార్చి 10
వారిసు (హిందీ) మార్చి 10
డిస్నీ+హాట్‌స్టార్..
చాంగ్ కెన్ డంక్ (మూవీ) మార్చి 10
జీ5..
రామ్‌యో (కన్నడ) మార్చి 10
బొమ్మై నాయగి (తమిళ్) మార్చి 10
బౌడీ క్యాంటీన్ (బంగ్లా) మార్చి 10
మిడిల్ క్లాస్ లవ్ (హిందీ) మార్చి 10
సోనీ లివ్..
యాక్సిడెంటల్ ఫార్మర్ అండ్ కో (తమిళ్ సిరీస్) మార్చి 10
క్రిస్టీ (మలయాళం) మార్చి 10
బ్యాడ్ ట్రిప్ (తెలుగు) మార్చి 10
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/