Site icon Prime9

Bihar: కాసేపట్లో పెళ్లి.. వరుడిని చూసి ట్విస్ట్ ఇచ్చిన వధువు

bride

bride

Bihar: కాసేపట్లో పెళ్లి.. బంధువులంతా వచ్చారు. పెళ్లి వేదికపైకి వధువు చేరుకుంది. ఇక మూడుముళ్లు పడతాయనగా పెళ్లి కూతురు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చింది. వరుడిని చూసి.. ఈ పెళ్లి ఇష్టం లేదంటూ చెప్పేసింది. దీంతో బంధువులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

షాకిచ్చిన వధువు..

కాసేపట్లో పెళ్లి.. బంధువులంతా వచ్చారు. పెళ్లి వేదికపైకి వధువు చేరుకుంది. ఇక మూడుముళ్లు పడతాయనగా పెళ్లి కూతురు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చింది. వరుడిని చూసి.. ఈ పెళ్లి ఇష్టం లేదంటూ చెప్పేసింది. దీంతో బంధువులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

బిహార్ రాష్ట్రంలో బాగల్‌పుర్‌లోని కహల్‌గావ్‌ ప్రాంతంలో ఇది జరిగింది. వరుడు నల్లగా ఉన్నాడని.. వయసులో తనకంటే చాలా పెద్దవాడిగా కనిపిస్తున్నాడని వధువు ఫిర్యాదు చేసింది. బంధువులు నచ్చజెప్పిన వినకుండా పెళ్లిని రద్దు చేసుకుంది. పెళ్లికి ఊరేగింపుగా వచ్చిన వరుడిని చూసి.. యువతి ముఖం ఒక్కసారిగా మాడిపోయింది. స్థానిక యువతి కిట్టూ కుమారి(20)కి.. సమీప ప్రాంతానికి చెందిన నీలేశ్ కుమార్ సింగ్‌(38)తో వివాహం నిశ్చయించారు.

ఈ క్రమంలో పెళ్లి రోజురానే వచ్చింది. కొద్దిసేపట్లో పెళ్లి అనగా.. కాబోయే భర్తను చూసి వధువు ముఖం చాటేసింది. దీంతో వరుడి మెడలో దండ వేసేందుకు.. నిరాకరించింది. ఇదేంటని ప్రశ్నించగా.. వరుడు నల్లగా ఉన్నాడని తెగేసి చెప్పింది. అక్కడి బంధువులు.. ఆమెతో పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశారు. యువతి వినకపోవడంతో.. చేసేదేమి లేక పెళ్లిని రద్దు చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version