Site icon Prime9

Jason Sanjay: తెలుగు హీరోతో దళపతి విజయ్‌ కొడుకు జాసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ మూవీ – మోషన్‌ పోస్టర్‌ అవుట్‌

Jason Sanjay First Movie Motion Poster: దళపతి విజయ్‌ హీరోగా కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఎంతోమంది తమిళ ఆడియన్స్‌ మనసు దొచుకుని అగ్ర హీరోగా ఎదిగారు. ఇప్పుడు ఆయన వారసుడు జాసన్‌ సంజయ్‌ ఇండస్ట్రీలో ఎంట్రీకి రెడీ అయ్యాడు. అయితే కెమెరా ముందుకు కాకుండా వెనకాల ఉండి సినిమా తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. జేసన్‌ సంజయ్‌ దర్శకుడిగా తన మొదటి సినిమాకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను టాలీవుడ్‌ హీరో సందీప్‌ కిషన్‌తో చేయనున్నాడు.

డెబ్యూ మూవీతోనే అటూ తమిళ్‌, ఇటూ తెలుగు ఆడియన్స్‌ని మెప్పించేందుకు గట్టి ప్లాన్‌ చేశాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రొడక్షన్స్‌లో భారీ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందనుంది. తాజాగా దీనిపై సందరు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది. జేసన్‌ సంజయ్‌ ప్రొడక్షన్‌ 01గా ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటించారు. ఈ మేరకు మోషన్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ఇది సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జానర్‌ తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ మోషన్‌ పోస్టర్‌లో డబ్బును ప్రథమంగా చూపించారు.

చూస్తుంటే ఈ సినిమా డబ్బు చూట్టూ తిరిగే కథనం అయ్యింటుందని సమాచారం. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందించనున్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్‌ మోషన్‌ పోస్టర్‌ లాంచ్‌ సందర్భంగా లైకా ప్రొడక్షన్‌ అధినేత జీకెం తమిళ్‌ కుమారన్‌ మీడియాతో మాట్లాడారు. “మొదటి నుంచి మా సంస్థ మంచి కథకులను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తూను ఉంది. అందులో భాగంగానే అందులో భాగంగానే జాసన్‌ సంజయ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. ఆయన కథ చెప్పినప్పుడు చాలా డిఫరెంట్‌గా అనిపించింది.

పాత్రలను డిజైన్‌ చేసిన తీరు అనుభవం ఉన్న దర్శకుడిలా కనిపించారు. అన్నింటికంటే ముఖ్యంగా పాన్‌ ఇండియా దృష్టిని ఆకర్షించే పాయింట్‌ ఉంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నాం. సందీప్‌ కిషన్‌ ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఈ సరికొత్త కాంబో ప్రేక్షకులకు మంచి అనుభవాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం” అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం ప్రస్తుతం సాంకేతిక నిపుణులతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు, నటీనటులు ఎవరనేది వెల్లడిస్తామన్నారు. ఇక వచ్చే ఏడాది 2025 జనవరి నుంచి సినిమా షూటింగ్‌ ప్రారంభం అవుతుందని చెప్పారు.

Exit mobile version