Vaikunta Ekadasi : వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో అలయాలకు పోటెత్తుతున్న భక్తులు…

  • Written By:
  • Publish Date - January 2, 2023 / 11:55 AM IST

Vaikunta Ekadasi : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇరు తెలుగు రాష్ట్రాలలోని ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకొని పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన తిరుమల, యాదాద్రి, అన్నవరం, భద్రచలం, ద్వారక తిరుమల, మంగళగిరి, విజయవాడ, అనంతపురం, ధర్మపురి, సహా అన్ని ఆలయాల్లో భక్తుల రద్దీ ఏర్పడింది.

ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి అర్ధరాత్రి 12.05 గంటలకు దర్శనాలను ప్రారంభించారు. మొదట వీవీఐపీలు, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలో వీఐపీ భక్తుల తాకిడి కూడా తిరుమలలో పెరిగింది. మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే, కర్నాటక గవర్నర్ థాహర్ చంద్ గ్లేహట్, జమ్ము గవర్నర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, అంబటి రాంబాబు, విశ్వరూప్‌ పాల్గొన్నారు.

వారితో పాటు తెలంగాణ మంత్రులు మల్లారెడ్డి, గంగుల, ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, పీ అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి… సహా ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు తిరుమలకు తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచి ఆరు గంటల వరకు శ్రీవాణి ద్వారా టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు. కాగా, తిరుమలలో ఈ నెల 11 వరకు వైకుంఠ ద్వారం ద్వారా భక్తులను అనుమతిస్తారు.