Site icon Prime9

 Telangana Government: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్ సర్కార్

cm-kcr

cm-kcr

 Telangana Government: తెలంగాణలో ప్రభుత్వ(Telangana Government) ఉద్యోగులు, పెన్షనర్లకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 2.73 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఫిబ్రవరి నుంచి డీఏ చెల్లించనుంది. జనవరి పెన్షన్ తో కలిసి ఇవ్వనున్నారు. 2021 జులై నుంచి 2022 డిసెంబరు వరకు 8 విడతల్లో డీఏ బకాయిలను జీపీఎఫ్ లో జమ చేయనున్నట్టు ప్రభుత్వం

ఉత్వర్వుల్లో పేర్కొంది.

డీఏ పెంపు ఉద్యోగులు, పెన్షన్లకు శుహవార్త అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

తాజా ఉత్తర్వు ప్రకారం డీఏ 17.29 నుంచి 2.02 శాతానికి పెరిగిందని ఆయన తెలిపారు.

రాష్ట్రంలోని 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షన్ దారులకు ప్రయోజనం కలిగిందన్నారు.

బదిలీల షెడ్యూల్ విడుదల

మరో వైపు రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీకు సంబంధించిన షెడ్యూల్ నున రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది.

ఈ షెడ్యూల్ ప్రకారం జనవరి 27 నుంచి టీచర్లకు ప్రమోషన్స్, ట్రాన్స్ ఫర్స్ ప్రక్రియ మొదలవుతుంది. జనవరి 28 నుంచి 30 వరకు ఆన్ లైన్ లో అప్లికేషన్స్ స్వీకరిస్తారు.

మార్చి 4 నాటికి టీచర్ల ప్రమోషన్స్, ట్రాన్స్ ఫర్స్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అదే విధంగా మార్చి 5 నుంచి 19 వరకు ఏదైనా అప్పీల్ చేసుకోవాలనుకుటే దరఖాస్తు చేసుకుననే అవకాశం కల్పించారు.

టీచర్ల నుంచి అప్లికేషన్స్ అందిన 15 రోజల లోపు అప్పీల్ ను పరిష్కరిస్తారు.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లకు ప్రభుత్వ విడుదల చేసిన తాజా షెడ్యూల్ తో నిరీక్షణ తప్పింది.

కాగా, తెలంగాణలో ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలకు సీఎం కేసీఆర్ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

సీఎం ఆదేశాల మేరకు షెడ్యూల్ విడుదల చేసేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఎస్జీటీలకు స్కూల్ అసిస్టుంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లకు ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నతులు రానున్నాయి.

రాష్ట్రంలోని దాదాపు 9266 మంది టీచర్లు ప్రమోషన్స్ పొందనున్నారు.

చివరిసారిగా 2015 లో ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ కల్సించారు. అప్పటి నుంచి ఉపాధ్యాయులు పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే 137 జీవో ప్రకారం బదిలీ అయిన ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చారు. దాదాపు 50 వేల మంది టీచర్లు బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు.

2018 లో చివరిసారిగా టీచర్ల బదిలీలు జరిగాయి.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version