Telangana Highcourt : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అందరికీ తెలిసిందే.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణను సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది.
తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధించింది.
మొయినాబాద్ ఫాం హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐకి అప్పగిస్తూ 2022 డిసెంబర్ 26వ తేదీన తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 4వ తేదీన హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది.
ఈ విషయమై ఇరు వర్గాలను వాదనలను విన్న హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ కేసు విచారణను సీబీఐ అప్పగింతను సమర్ధించింది.
2022 అక్టోబర్ 26వ తేదీన మొయినాబాద్ ఫాంహౌస్ లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టేందుకు ముగ్గురు ప్రయత్నించారు.
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను ముగ్గురు ప్రలోభాలు పెట్టేందుకు ప్రయత్నించారని కేసు నమోదైంది.
తాండూరు ఎమ్మెల్యే మొయినాబాద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఈ ఫిర్యాదు మేరకు రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల వెనుక బీజేపీ హస్తం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు.
ఈ విషయమై ఆడియో, వీడియో సంభాషణలను కూడా మీడియాకు కేసీఆర్ అందించారు.
సిట్ విచారణను బీజేపీ సహ ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు వ్యతిరేకించారు.
సీబీఐ విచారణ చేయాలని కోరారు. ఈ పిటిషన్లపై విచారణ చేసిన సింగిల్ బెంచ్ సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
సిట్ విచారణ పారదర్శకంగా లేదని కూడా తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ అభిప్రాయపడింది.
ఈ విచారణ పారదర్శకంగా జరగాలంటే సీబీఐ విచారణ అవసరమని హైకోర్టు వెల్లడించింది.
అంతకు ముందు ఈ తీర్పుపై డివిజన్ బెంచ్ లో కేసీఆర్ సర్కార్ సవాల్ చేసింది. డివిజన్ బెంచ్ కూడా సీబీఐ విచారణను సమర్ధించింది.
సీబీఐతో విచారణకు గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాలపై తెలంగాణ సర్కార్.. డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. సీబీఐ విచారణకే మొగ్గు చూపింది.
ఈ కేసులో జనవరి 18న చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పును రిజర్వ్ చేశారు.
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు వెళ్లేందుకు అడ్వకేట్ జనరల్ కొంత సమయం అడిగారు.
అప్పటి వరకు ఆర్డర్ సస్పెండ్ లో ఉంచాలని కోరారు. అయితే ఆర్డర్ సస్పెన్షన్ కు హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/