Site icon Prime9

CM MK Stalin: ఆలయానికి రూ.46 కోట్ల బంగారాన్ని అందజేసిన సీఎం స్టాలిన్

Tamil Nadu: ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం తిరువళ్లూరు జిల్లా పెరియపాళయంలోని భవానీ అమ్మన్ ఆలయానికి రూ. 46.31 కోట్ల విలువైన బంగారు డిపాజిట్ బాండ్‌ను అందజేశారు. 91.61 కిలోల బరువున్న బంగారు బిస్కెట్లు (రూ. 46.31 కోట్ల విలువైన బంగారంతో తయారు చేయబడ్డాయి). స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ముంబై బ్రాంచ్‌లో జమ చేసారు. దీని ద్వారా ఆలయానికి ఏడాదికి రూ.1.04 కోట్ల వడ్డీ వస్తుంది.గత 10 ఏళ్లలో భక్తులు సమర్పించిన బంగారు కానుకలను, ఆలయాలు ఉపయోగించకుండా వదిలేసాయి. ముంబైలోని ప్రభుత్వ టంకశాలలో కరిగించి, ఆ విధంగా వచ్చిన స్వచ్ఛమైన బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి అదనపు ఆదాయాన్ని పొందుతామని గత ఏడాది ప్రకటించారు.

దీన్ని పర్యవేక్షించేందుకు రిటైర్డ్ న్యాయమూర్తుల నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు. చెన్నై జోన్ కోసం, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి దురైసామి రాజు నేతృత్వంలోని కమిటీ, ముంబైలోని ప్రభుత్వ మింట్‌లో కరిగించడానికి బంగారు కానుకలను పంపే ప్రక్రియను పర్యవేక్షించింది.

Exit mobile version