Site icon Prime9

Monkeypox virus: కేరళలో మంకీపాక్స్ అనుమానాస్పద కేసు

Kerala: ఇటీవల విదేశాల నుండి కేరళ కు తిరిగి వచ్చిన ఒక వ్యక్తికి మంకీపాక్స్ వైరస్ లక్షణాలను ఉండటంతో ఆసుపత్రిలో చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాతే వ్యాధి నిర్ధారణ అవుతుందని ఆమె తెలిపారు. ఆ వ్యక్తికి వైరస్ లక్షణాలు కనిపించాయని, విదేశాల్లో ఉన్న మంకీపాక్స్ రోగితో సన్నిహితంగా ఉన్నారని జార్జ్ చెప్పారు.

మంకీ పాక్స్ అనేది వైరల్ జూనోసిస్ (జంతువుల నుండి మానవులకు సంక్రమించే వైరస్) మశూచి రోగులలో గతంలో కనిపించే లక్షణాలతో ఉంటుంది. దానితో పోల్చినపుడు తక్కువ తీవ్రతతో ఉంటుంది.ఇటీవల కోల్‌కతాలోని ఓ వ్యక్తి మంకీపాక్స్ వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. అయితే, పూణేలోని ఎన్‌ఐవి నుండి కోల్‌కతాకు అతని రక్త నమూనా మరియు దద్దురు ద్రవం యొక్క నివేదిక వచ్చిన తర్వాత అతనికి నెగెటివ్ గా నిర్దారణ అయింది.

1958లో పరిశోధన కోసం ఉంచిన కోతులలో మొదటిసారిగా మంకీపాక్స్ కనుగొన్నారు. ఇది మానవ మశూచిని పోలిన అరుదైన వైరల్ ఇన్ఫెక్షన్
1970లో మనుషుల్లో మంకీపాక్స్ యొక్క మొదటి కేసు వెలుగుచూసింది. ఈ వ్యాధి ప్రధానంగా మధ్య మరియు పశ్చిమ ఆఫ్రికాలోని ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతాలలో సంభవిస్తుంది.

 

Exit mobile version