Site icon Prime9

Supreme Court: మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణలో కీలక పరిణామం

Supreme Court key Judgments on Jagan Bail Cancellation: ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మరోసారి మార్చింది. ఈ రెండు కేసుల విషయాల్లో బదిలీ చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ కేసుల విచారణ విషయంపై సుప్రీంకోర్టులో మార్పు చోటుచేసుకుంది.

గతంలో జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం ఈ కేసులను విచారించగా.. 12 ఏళ్లుగా ట్రయల్ అడుగు కూడా ముందుకు కదలలేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఈ నేపథ్యంలోనే జస్టిస్ బి.వి.నారత్న, జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ధర్మాసనానికి ట్రయల్‌ను మార్చింది.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఏపీ మాజీ సీఎం జగన్ దంపతులు లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. తమ కూతురు గ్రాడ్యుయేషన్ డేలో హాజరు అయ్యేందుకు తన సతీమణి భారతితో కలిసి లండన్ వెళ్లారు. ఇందులో భాగంగానే జగన్ అక్కడ సూట్ ధరించి ఫ్యామిలీతో ఉన్న వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోను జగన్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. కాగా, ఈనెల 11న లండన్ వెళ్లిన జగన్.. తిరిగి 30న భారత్‌కు రానున్నారు.

Exit mobile version