Site icon Prime9

Super Star Rajini Kanth : జైలర్ మూవీ నాకు ఎబోవ్ యావరేజ్ అనిపించింది – రజినీకాంత్

super-star-rajini-kanth shocking comments on jailer movie

super-star-rajini-kanth shocking comments on jailer movie

Super Star Rajini Kanth : సూపర్ స్టార్ రజినీకాంత్.. రీసెంట్ గా “జైలర్” సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. అటు రజినీకి, ఇటు నెల్సన్ కి మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల వరుస ప్లాప్ సినమాలతో ఇబ్బంది పడ్డారు రజినీకాంత్. ఇక ఆయన పని అయిపోయింది.. రజినీకాంత్ కు ఇక మార్కెట్ లేదు.. అంత రెమ్యూనరేషన్ ఎందుకు తీసుకుంటున్నాడు అని.. రకరకాల కామెంట్లు కూడా వినిపించాయి. మరోవైపు నెల్సన్ కూడా బీస్ట్ డిజాస్టర్ తో బాగా ట్రోల్ అయ్యారు. దాంతో వీరిద్దరికీ ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపించింది. ఫైనల్ గా దాదాపు 800 కోట్ల వరకూ రాబట్టినట్టు తెలుస్తోంది.

కాగా ఈ సూపర్ సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రజినీకాంత్ (Super Star Rajini Kanth), నెల్సన్, అనిరుధ్ లకు లగ్జరీ కార్లతో పాటు అధనపు రెమ్యూనరేషన్ కూడా గిఫ్ట్ గా ఇచ్చారు కళానిధి మారన్. తాజాగా ఈమూవీ సక్సెస్ ను  నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాకు పనిచేసిన వారందరికీ సక్సెస్ షీల్డ్ లతో పాటు ఒక బంగారు నాణెం కూడా ఇచ్చారు. రజినీ కాంత్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇంతకీ ఆయన ఏం మాట్లాడారంటే.. ఒక సినిమా మంచి విజయం సాధిస్తే ఆర్టిస్టులని, టెక్నిషియన్స్ ని ఎలా గౌరవించాలో కళానిధి మారన్ కి తెలుసు. మొదటి నుంచి కూడా ఆయన సినిమా హిట్ అవుతుందని చెప్తూనే ఉన్నారు. సినిమా రీ రికార్డింగ్ ముందు కళానిధి అక్కడ ఉన్న కొంతమందిని సినిమా ఎలా ఉంది అని అడిగితే బాగుంది, హిట్ అవుతుందని చెప్పారు. ఇంకొకరు యావరేజ్ అన్నారు. నిజం చెప్పాలంటే జైలర్ సినిమా నాకు కూడా ఎబోవ్ యావరేజ్ అనిపించింది. కానీ రీ రికార్డింగ్ మొత్తం అయ్యాక, అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. అనిరుధ్ నా కొడుకు లాంటివాడు. నాకు హిట్ ఇచ్చాడు, అతని ఫ్రెండ్ నెల్సన్ కి హిట్ ఇచ్చాడు అని అన్నారు. దీంతో ఇప్పుడు సూపర్ స్టార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

 

 

ఇక ఈ సినిమాలో రజనీకాంత్ కి భార్యగా రమ్యకృష్ణ నటించారు. అలానే తమన్నా, యోగిబాబు, వసంత రవి, సునిల్ తో పాటు.. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీష్రాఫ్, నాగబాబు లాంటి సౌత్ స్టార్స్ గెస్ట్ అపీరియన్స్ లో అదరగొట్టారు. ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈసినిమా.. డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద కూడా తన సత్తా చాటుతోంది.

 

Exit mobile version