Site icon Prime9

The Archies : సుహానా ఖాన్, ఖుషి కపూర్ నటిస్తున్న ‘ది ఆర్చీస్’ మూవీ టీజర్ రిలీజ్.. ఒకే మూవీలో షారుఖ్, శ్రీదేవి కూతుర్లు

suhana khan and khushi kapoor the archies movie teaser released

suhana khan and khushi kapoor the archies movie teaser released

The Archies : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షారూఖ్ ఖాన్ కుమారుడు, కుమార్తె గురించి కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. షారూఖ్ ముద్దుల కుమార్తె సుహానా ఖాన్ ఖాన్ ఇప్పటి వరకు వెండి తెరకు ఎంట్రీ ఇవ్వకపోయినప్పటికి సోషల్ మీడియా ద్వారా అందరికీ సుపరిచితురాలే. ఇక ఇన్ స్టా వేదికగా ఈ అమ్మడు పోస్ట్ చేసే హాట్ ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. త్వరలోనే ‘ది ఆర్చీస్’ అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ కూడా ఇవ్వనుంది సుహానా.

బాలీవుడ్ డైరెక్టర్ జోయా అక్తర్ తెరకెక్కిస్తున్న ‘ది ఆర్చీస్’ సినిమాలో షారుఖ్ కూతురు సుహానాతో పాటు అతిలోక సుందరి శ్రీదేవి కూతురు ఖుషి కపూర్ కూడా నాటిస్తుందడడం విశేషం. కొత్తవాళ్ళని తీసుకొని ఈ సినిమా చేస్తోంది జోయా అక్తర్. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. ఈ టీజర్ ని గమనిస్తే.. ఇది 1964 లో జరిగే కథని.. కాలేజీ లెవెల్ లో ఫ్రెండ్స్ మధ్య జరిగే కథ అని తెలుస్తుంది. లవ్ అండ్ కామెడీ డ్రామాగా ది ఆర్చీస్ ఉండబోతుంది. ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది.

సుహానా, ఖుషి కపూర్ కి ఇదే డెబ్యూట్ సినిమా కావడంతో షారుఖ్, జాన్వీ అభిమానులు, బాలీవుడ్ కూడా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తుంది. ఇక ఈ టీజర్ ని షారుఖ్ ఖాన్ షేర్ చేస్తూ.. ఫాదర్స్ డే రోజు నా బేబీకి బెస్ట్ విషెస్ అండ్ ఈ సినిమాలో నటించే అందరి బేబీస్ కి కూడా అని ట్వీట్ చేశాడు. త్వరలోనే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

Exit mobile version