Site icon Prime9

Ramagundam Fertilizer Plant: రామగుండం ఎరువుల కర్మాగారంలో నిలిచిపోయిన యూరియా ఉత్పత్తి

Ramagundam: విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. అమ్మోనియా, బ్యాగింగ్, కన్వేయర్ యూనిట్ సెక్షన్ లో ఈదురు గాలులతో పై కప్పు లేచిపోయింది. దీంతో 50 వేల యూరియా బస్తాలు నీటిలో కరిగిపోయింది. ప్లాంట్ నిర్మాణ సమయంలో నాసిరకం పనులు చేయడం వల్ల ఈ సంఘటన జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఉత్పత్తి ఆగిపోవడంతో యూరియా రవాణా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం యూరియా ఉత్పత్తి యధావిధిగా కొనసాగుతుందని ప్రకటించారు.


Exit mobile version