Site icon Prime9

Special ministry for the disabled: దివ్యాంగులకోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ.. తెలంగాణ సర్కార్ నిర్ణయం

Telangana

Telangana

Telangana News: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం(డిసెంబరు 3) సందర్భంగా తెలంగాణ కీలక నిర్ణయం తీసుకుంది. స్త్రీ, శిశు సంక్షేమశాఖలో భాగంగా ఉన్న దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమశాఖ విభాగాన్ని మంత్రిత్వ శాఖగా ఏర్పాటుచేసేందుకు నిర్ణయించింది. కొత్త మంత్రిత్వశాఖపై తెలంగాణ సర్కార్ శనివారం ఉత్తర్వులు జారీ చేయనుంది. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేకశాఖ ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

దివ్యాంగుల, వృద్ధులు, ట్రాన్స్ జెండర్ల కోసం మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. , వృద్ధులు, ట్రాన్స్‌జెండర్లకు సంక్షేమం, ఇతర సేవలు అందించేందుకు వీలుగా జిల్లా స్థాయిలోనూ మహిళ, శిశు సంక్షేమ శాఖ నుంచి వీటిని వేరుచేశారు. వీటికి జిల్లా సంక్షేమ అధికారిని నియమించనున్నారు. మహిళ శిశు సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమ శాఖల మధ్య ప్రతి జిల్లాకు శాఖాపరమైన ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ నగరంలో పెండింగ్ ఆసరా పింఛన్లు పంపిణీ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు వేగం చేశారు. వయస్సు కుదింపు చేసిన తరువాత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అధికారులు వడపోత చేపట్టి అర్హులను గుర్తించి గత రెండు నెల నుంచి ఆసరా కార్డులు స్దానిక ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశం ఏర్పాటు పంపిణీ చేశారు. జిల్లాలో వివిధ కేటగిరీలకు చెందిన వారు ఇప్పటివరకు 1.98 లక్షల మంది పింఛన్లు తీసుకుంటున్నారు. వీరికి నెలకు వృద్దులు, వితంతువులకు రూ. 2016, వికలాంగులకు రూ. 3016 చొప్పన బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar