Site icon Prime9

Somu Veerraju: 2024వరకు ఏపీకి భాజపా అధ్యక్షుడుగా సోము వీర్రాజు

Somu Veerraju as BJP President of AP till 2024

Somu Veerraju as BJP President of AP till 2024

Ap BJP: 2024 పార్లమెంటు ఎన్నికల వరకు ఏపీ భాజపా అధ్యక్షడుగా సోము వీర్రాజు కొనసాగనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నేత ప్రకాష్ స్పష్టం చేశారు. ముఖ్య నేతలతో అమరావతిలో చేపట్టిన సమావేశంలో పేర్కొన్నారు.

నవంబర్ నుండి జిల్లాల వారీగా నాయకులకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టనున్నారు. మరోవైపు ఏపీలో భాజపా పుంజుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు చేసుకొంటున్నారు. ఏడాది చివరిలో కొద్ది రోజులు పాదయాత్ర చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.

దీంతో పాటు కేంద్రం నుండి రాష్ట్రానికి చేసిన సాయం, ఏపి సీఎం జగన్ చేసిన మోసాలను ప్రజలకు తెలియచేయాలని కూడా పిలుపు నిచ్చారు. 2024 ఎన్నికల్లో భాజపా, జనసేన పార్టీలు కలిసి విజయం సాధించే దిశగా పని చేయాలని నేతలు సూచించారు.

అయితే భాజపా కేంద్ర పెద్దలు, వైకాపా ప్రభుత్వానికి పూర్తి సహాకారాన్ని ఇస్తుండడాన్ని ప్రజలు నిశతంగా గమనిస్తున్నారు. జనసేనను రాజకీయ అవసరాలకు వాడుకొనేందుకు భాజపా వేసిన ఎత్తులో భాగంగానే ఉందన్న విషయాన్ని కూడా తెలుసుకొంటున్నారు. మొత్తం మీద దక్షిణాధిన భాజపా బలమైన పార్టీగా ఎదిగేందుకు రాజకీయ ఎత్తులుగా ప్రజలు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Munugode by poll: దత్తత తీసుకొనే దమ్ము టీఆర్ఎస్ అభ్యర్ధికి లేదా? భాజపా అభ్యర్ధి కోమటిరెడ్డి

Exit mobile version