Site icon Prime9

దారుణం – సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య

Software Engineer Suicide: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కోకాపేటలో చోటుచేసుకుంది. నాగ ప్రభాకర్‌(27) అనే టెక్కీ హాస్టల్‌ 9వ భవనంపై నుంచి దూకీ బలవన్మరణం చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాగా అప్పుల బాధల కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. పోలీసుల సమాచారం ప్రకారం… మృతుడు ఆంధ్రప్రదేశ్‌లోని తణుకు చెందిన నాగ ప్రభాకర్‌ హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పని చేస్తున్నారు. దీంతో కోకాపేటలోనే హాస్టల్లో ఉంటున్న అతడు గురువారం సాయంత్రం హాస్టల్ భవనంపై దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Exit mobile version