Site icon Prime9

DJ Tillu 2 : సిద్దు ” డీజే టిల్లు ” కి హీరోయిన్ కష్టాలు… ఆ సీన్ల కారణం గానే ప్రాబ్లమా !

siddu-jonnalagadda-dj-tillu-2-movie-facing-issues-over-heroin-selection

siddu-jonnalagadda-dj-tillu-2-movie-facing-issues-over-heroin-selection

DJ Tillu 2 : యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన ” డీజే టిల్లు ” సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ ని సొంతం చేసుకుంది. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ చిత్రాన్ని రూపొందించారు. కాగా చిన్న మూవీగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మంచి కలెక్షన్లను రాబట్టింది.

దీంతో సిద్ధుకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి టైటిల్, హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను ప్రకటిస్తూ ఒక వీడియో ను కూడా రిలీజ్ చేశారు. అయితే మొదటగా ఫస్ట్ పార్ట్‌లో నటించిన నేహా శెట్టికి బదులుగా యంగ్ హీరోయిన్ శ్రీలీలను తీసుకున్నారు. కానీ ఆమె డేట్స్ ఖాళీగా లేకపోవడంతో తర్వాత అనుపమ పరమేశ్వరన్ ఎంట్రీ ఇచ్చింది. అయితే కొన్ని రోజులు షూటింగ్ చేశాక అనుపమ ఈ సినిమా నుంచి తప్పకుందని వార్తలు వినిపించాయి.

ఇక ఈ తరుణంలోనే గత కొన్ని రోజులుగా ఈ మూవీలో హీరోయిన్ గా మడోన్నా సెబాస్టియన్ పేరు వినిపిస్తుంది. కానీ అనూహ్యంగా హిట్ రిలీజ్ అయినప్పటి నుంచి ” మీనాక్షి చౌదరి ” ఈ సినిమాలో యాక్ట్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా గట్టిగా ప్రచారం జరుగుతుంది. అసలు ఇంత మంది హీరోయిన్స్ ఎందుకు మారుతున్నారు అంటూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తుంది. అయితే టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇంటిమేట్ సీన్స్‌ ఉన్నాయట. అందుకే సదరు హీరోయిన్లు ఆ సీన్లతో ఇబ్బంది పడుతూ తప్పుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరో వైపు తమ కెరీర్‌లో ఇప్పటి వరకు చేసిన పాత్రలన్నింటికీ భిన్నంగా కొత్తగా ప్రెజెంట్ చేయాలని సినిమా దర్శకుడు కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇదే చిన్న చిన్న సమస్యలకు దారితీసి చివరకు హీరోయిన్లు ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ‘డీజే టిల్లు’ మూవీలో నేహాశెట్టికి లిప్ లాక్ సీన్ మాత్రమే ఉంది. చూడాలి మరి ఈ విషయంపై మూవీ యూనిట్ ఎలా స్పందిస్తారో అని.

Exit mobile version