Suhana Khan : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షారూఖ్ ఖాన్ కుమారుడు, కుమార్తె గురించి కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. షారూఖ్ ముద్దుల కుమార్తె సుహానా ఖాన్ ఖాన్ ఇప్పటి వరకు వెండి తెరకు ఎంట్రీ ఇవ్వకపోయినప్పటికి సోషల్ మీడియా ద్వారా అందరికీ సుపరిచితురాలే. ఇక ఇన్ స్టా వేదికగా ఈ అమ్మడు పోస్ట్ చేసే హాట్ ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. త్వరలోనే ‘ది ఆర్చీస్’ అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ కూడా ఇవ్వనుంది సుహానా. అయితే హీరోయిన్ అవ్వకముందే సుహానా ఖాన్ ఓ ప్రముఖ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచింది.
మేకప్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ని ఉత్పత్తి చేసే ప్రముఖ బ్రాండ్ మేబెల్ లైన్ కు సుహానా బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. ఈ మేరకు మేబెల్ లైన్ నిర్వహించిన ఈవెంట్ లో సుహానా పాల్గొంది. అలానే ఈ కార్యక్రమంలో సుహానా నటించిన యాడ్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ మేరకు ఈ ఈవెంట్ లో సుహానా రెడ్ డ్రెస్ లో వచ్చి అందరినీ ఫిదా చేసేసింది. అదే విధంగా తన స్పీచ్ లో పద్దతిగా మాట్లాడి అందర్నీ మెప్పించింది. మొదటి సారి సుహానా స్టేజి మీద మాట్లాడటంతో ఈ ఈవెంట్ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో షారుఖ్ అభిమానులు కూడా సుహానాని తెగ పొగిడేస్తున్నారు.
నేను కూడా ఇందులో కొంచెం క్రెడిట్ తీసుకుంటాను – షారూఖ్ ఖాన్
కాగా ఈ క్రమంలోనే కూతురు సుహానా ఖాన్ (Suhana Khan) బ్రాండ్ అంబాసిడర్ గా నిలవడం, మొదటి సారి స్టేజిపై మాట్లాడటం పట్ల షారుఖ్ స్పందించాడు. ఇన్ స్టా వేదికగా ఓ వీడియోని షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. మేబెల్‌లైన్ యాడ్ కు నా అభినందనలు బేటా. చాలా చక్కగా దుస్తులు ధరించావు. చాలా బాగా మాట్లాడావు, బాగా చేశావు. నేను కూడా ఇందులో కొంచెం క్రెడిట్ తీసుకుంటాను, నేను నిన్ను బాగా పెంచాను కాబట్టి. లవ్ యు మై లిటిల్ లేడీ అని షారుఖ్ పోస్ట్ చేశాడు.
ఈ పోస్ట్ కి సుహానా కూడా ఆ.. సో క్యూట్ అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో అభిమానులు, నెటిజన్లు ఓ పక్కన సుహానాను అభినందిస్తూ.. పోస్ట్ లు పెడుతున్నారు. ఇక ఇటీవల షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణె జంటగా నటించిన సినిమా పఠాన్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ వివాదాల నడుమ విడుదలైంది. ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ నిరసనల మధ్య విడుదలైనప్పటికి.. రిలీజ్ తర్వాత సంచలనాలు సృష్టించింది. వరుస ప్లాపులతో కుంగిపోయిన బాలీవుడ్ ఇండస్ట్రికి.. పఠాన్ ప్రాణం పోసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరి భారీ సక్సెస్ అందుకుంది.