Actress Yamuna : తెలుగు టీవి ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు నటి “యమున”. అలాగే టాలీవుడ్ లో కూడా 1989 లో తొలిసారి మౌన పోరాటం అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఆమె తర్వాత టీవీ ఇండస్ట్రీలో అనేక సీరియళ్లలో నటిస్తూ బుల్లితెరపై స్థిరపడిపోయింది. ముఖ్యంగా ఆమె `విధి`, `అన్వేషిత`, `మౌన పోరాటం`, `దేవి` , `అమృతం`, `రక్త సంబంధం`వంటి సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు ఈమె. ప్రస్తుతం పలు సీరియల్ లలో నటిస్తూ కెరీర్ పరంగా సక్సెస్ ఫుల్ గా గడుపుతుంది. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.
అయితే ఆమె గతంలో ఓ సందర్భంలో వ్యభిచార కేసులో ఇరుక్కుంది. బెంగుళూరులో ఓ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ పట్టుపడిందనే వార్తలొచ్చాయి. కానీ దానిపై ఆమె కోర్ట్ కెళ్లింది. తనకు ఏ సంబంధం లేదని కోర్ట్ నుంచి క్లీన్ చీట్ కూడా తెచ్చుకుంది. కానీ దీనికి సంబంధించిన వార్తలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయని, తనని వెంటాడుతున్నాయని వాపోయింది నటి యమున. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోని పంచుకుంటూ ఎమోషనల్ అయ్యింది.
ఆ వీడియోలో మాట్లాడుతూ.. నన్ను నేను ఎంత మోటివేట్ చేసుకున్నా కూడా తెలియని ఓ బాధ అయితే నన్ను వెంటాడుతూనే ఉంది. అది కూడా సోషల్ మీడియా వల్ల ఎందుకంటే నేను ఏళ్ల క్రితమే ఓ ప్రాబ్లమ్ నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా ఉన్నాను. ఆ ప్రాబ్లమ్‌లో నేను ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చిందో ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో కూడా క్లారిటీ ఇచ్చేశాను. ఆ విషయంలో న్యాయస్థానం కూడా నాకు క్లీన్ చిట్ ఇచ్చి నన్ను గెలిపించింది. న్యాయ పరంగా నేను విజయం సాధించాను, నేను గెలిచాను, కానీ సోషల్ మీడియానే నేను కంట్రోల్ చేయలేకపోతున్నా. ఇప్పటికి కూడా నా గురించి, ఆ సంఘటన గురించి రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తుంటారు.
వాటిల్లో ఏం ఉందో నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఆ థంబ్ నెయిల్స్ మాత్రం నన్ను చాలా బాధపెడుతున్నాయి. ఈ విషయంలో నన్ను ఎంత నేను మోటివేట్ చేసుకున్నా..నేనూ మనిషినే కదా, తెలియని బాధ వస్తుంటుంది. నేను ఒక్కటే అనుకుంటాను, నేను ఆ థంబ్‌నెయిల్స్ చూస్తుంటే నేను చనిపోయినా కూడా నన్ను వీళ్ళు వదలరు అనిపిస్తుంది. అప్పటికీ కూడా ఏదో ఒకటి రాసి నా పేరుతో డబ్బులు సంపాదించుకుంటారనుకుంటా. నా ఫ్యామిలీకి నేను ఏంటో తెలుసు, వాళ్లకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్ ని కూడా చాలా తెలుసు. తెలియని వాళ్లు, నన్ను దగ్గర్నుంచి చూసినవాళ్ల నుంచి తెలుసుకోండి. సోషల్ మీడియాలో వచ్చేదంతా నిజం కాదు, వాటిని నమ్మకండి` అని వెల్లడించింది నటి యమున. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/