Site icon Prime9

Samantha : టామీ హిల్ ఫిగర్ బ్రాండ్ అంబాసిడర్ గా సమంత..

samantha signed as brand ambassador for tommy hilfigure

samantha signed as brand ambassador for tommy hilfigure

Samantha : ప్రముఖ వ్యాపార దిగ్గజం టామీ హిల్ ఫిగర్ సంస్థ తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్ ని ప్రకటించింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా అనౌన్స్ చేశారు. అమెరికాకు చెందిన టామీ సంస్థ ప్రకటనల్లో ఇప్పటివరకు పలువురు పాప్ ఐకాన్స్ కనిపిస్తూ వచ్చారు. అయితే తొలిసారి ఇందులో సమంతకు నటించే అవకాశం లభించింది. ఈ మేరకు టామీ హిల్ ఫిగర్ కి చెందిన మహిళల వాచ్ ల యాడ్స్ లో సామ్ కనిపించననుంది. స్ప్రింగ్ సమ్మర్ 23 క్యాంపెయిన్లో భాగంగా ఏప్రిల్ నెలలో టామీ హిల్ ఫిగర్ విడుదల చేసే ప్రకటనల్లో సమంత దర్శనమివ్వనున్నారు.

ఆమెకు సంబంధించి యాడ్స్ను అమితాబ్ కామే చిత్రీకరించనున్నారు. ఈ షూటింగ్ ముంబైలో జరగనుంది. టామీ హిల్ ఫిగర్ నుంచి రాబోతున్న విమెన్ కలెక్షన్ వాచ్ల్లో ఈసారి వైవిధ్యతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. స్టైల్తో పాటు రోజువారీ జీవితంలో వాడేలా సింపుల్గానూ అలాగే స్పోర్టీగానూ వాచ్లను డిజైన్ చేశారు. విమెన్స్ వాచ్ లలో స్టీల్, గోల్డ్ ప్లేట్, లెదర్వి కూడా ఉన్నాయని.. అన్ని వేడుకులకు ధరించేలా వీటిని డిజైన్ చేశారు. వాచ్లాగే కాకుండా చేతికి వేసుకునే బ్రేస్లెట్లా కూడా ఈ కొత్త ఉత్పత్తులను టామీ కంపెనీ రూపొందించింది.

సమంత బ్రాండ్కు అంబాసిడర్గా వ్యవహరించడంపై మోవాడా గ్రూప్ ప్రెసిడెంట్ రిచర్డ్ సీజర్ మార్టిన్స్ హర్షం వ్యక్తం చేశారు. టామీ బ్రాండ్ సమ్మర్ 2023 వాచ్ కలెక్షన్ను సమంతతో కలసి ప్రవేశపెడుతున్నందుకు ఉద్విగ్నంగా అలాగే గర్వంగానూ ఉందని ఆయన చెప్పారు. ఈ సీజన్ తమ వారసత్వాన్ని భవిష్యత్తులో ఎలా కొనసాగిస్తామనే దానికి తార్కాణంగా నిలవబోతోందన్నారు. సరికొత్త డిజైన్లు, నూతన రంగుల్లో ఉత్పత్తులను అందించడం టామీ సంస్థ ప్రత్యేకత అని రికార్డో సీజన్ పేర్కొన్నారు. సమంతలాగే ఈ కొత్త వాచ్లు కూడా డిజైన్, రంగు, నాణ్యతలో ఎంతో అపూర్వమని వ్యాఖ్యానించారు.

టామీ సంస్థ ఒక గ్లోబల్ బ్రాండ్ – సమంత (Samantha)

తనను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంపై సమంత స్పందించారు. ఈ క్రమంలో సామ్ మాట్లాడుతూ.. టామీ ఫ్యామిలీలో భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. వ్యక్తిగత అందంలో గడియారాలను ఒక భాగంగా తాను చూస్తూ వచ్చానన్నారు సామ్. టామీ సంస్థ ఒక గ్లోబల్ బ్రాండ్ అని.. ప్రతి వ్యక్తికి తమ వ్యక్తిగత స్టైల్, డిజైన్ ఉండేలా ఈ కంపెనీ ఉత్పత్తులను అందిస్తుందని సమంత ప్రశంసలు కురిపించారు. ఈ సంస్థ వాచ్లు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయని.. ఇవి తన వైవిధ్యమైన లుక్స్ సరిగ్గా సరిపోతాయని చెప్పుకొచ్చారు. టామీ నుంచి వస్తున్న స్ప్రింగ్ సమ్మర్ వాచ్లు తనకు ఎంతో నచ్చాయని.. వీటిని అందరికీ పరిచయం చేసేందుకు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని సమంత పేర్కొన్నారు.

ఇక సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే చివరగా యశోద మూవీతో మంచి హిట్ అందుకున్న ఈ భామ.. త్వరలోనే శాకుంతలం చిత్రంతో ప్రేక్షకులను అలరించనుంది. గుణశేఖర్ దర్శకత్వంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ఈ నెల 14 న రిలీజ్ చేయనున్నారు. భారీ తారాగణంతో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. చూడాలి మరి సామ్ హిట్ కొడుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.

Exit mobile version
Skip to toolbar