Road Extend Works in Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అధికారులు ఇళ్లు, షాపులను కూల్చివేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాలను ఇవాళ ఉదయం నుంచి కూల్చివేస్తున్నారు. దీంతో స్థానికంగా కొంత ఉద్రిక్తత నెలకొంది. మొత్తం 10 జేసీబీలతో అధికారులు పది బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే కూల్చివేత పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఉండే ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారు.
ఎలాంటి వివాదాలు తలెత్తకుండా దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే విస్తరణ పనులు జరుగుతున్న రహదారిలోకి వాహనదారులు రాకుండా అమరవీరుల స్థూపం వద్ద బారికేడ్లతో మార్గాన్ని మూసివేశారు. తమ ఇళ్లను ఖాళీ చేయమని అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్లను మాత్రమే టార్గెట్ చేస్తోందని, ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, తమ ఇళ్లను కూల్చితే తాము ఎక్కడికి పోవాలని ఆవేదన చెందారు.