Site icon Prime9

kantara Chapter 1: ‘కాంతార’ ప్రీక్వెల్‌ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది – రిలీజ్‌ ఎప్పుడంటే..

Kantara Chapter 1 Release Date: ఎలాంటి అంచనాలు లేకుండ చిన్న సినిమాగా వచ్చి పాన్‌ ఇండియా హిట్‌ కొట్టిన కన్నడ చిత్రం ‘కాంతార’. 2022లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. కన్నడ హీరో రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డుదలైన అన్ని భాషల్లోనూ ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన లభించింది. వరల్డ్‌ వైడ్‌గా రూ. 400 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసింది. విహోంబలే ఫిలిం నిర్మాణ సంస్థ రూపొందించిన ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా మరో పార్ట్‌ని తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ‘కాంతార చాప్టర్‌ 1’గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం ఈ ప్రీక్వెల్‌ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని మేకర్స్‌ ప్రకటించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. పీరియాడికల్ మూవీగా రూపొందుతోన్న ఈ ప్రీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమా టీజర్‌ విడుదల కాగా దానికి విశేష స్పందన వచ్చింది. ఈ మూవీ అప్‌డేట్స్‌ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాయి.

‘కాంతారను దక్షిణ భారత చరిత్రలో స్వర్ణ యుగంగా పేరొందిన కదంబ రాజ్య నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మూడో శతాబ్దపు కాదంబ రాజ్య వైభవం ప్రతిబింబించేలా కర్ణాటకలోని కుండాపుర అనే ప్రాంతంలో ఈ సినిమాకు భారీ సెట్‌ను వేశారు. ఇక ఈ సినిమాలోని తన పాత్ర కోసం రిషబ్‌ శెట్టి ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారు. సంప్రాదాయ యుద్ధ కళ అయిన కలరియుపట్టులో రిషబ్ శెట్టి శిక్షణ పొందుతున్నారు.

ఇదిలా ఉంటే రిషబ్‌ శెట్టి తెలుగులోను ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న హనుమాన్‌ సీక్వెల్‌ ‘జై హనుమాన్‌’లో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని ఆయన లుక్‌ విడుదల కాగా దీనికి మంచి రెస్సాన్స్‌ వచ్చింది. హనుమాన్‌ రిషబ్‌ శెట్టిని ప్రకటించగానే మూవీపై మరింత బజ్‌ క్రియేట్‌ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం రిషబ్‌ శెట్టి కాంతార ప్రీక్వెల్‌తో పాటు జై హనుమాన్‌ షూటింగ్‌తోనూ బిజీగా ఉన్నాడు.

Exit mobile version