Renu Desai speech in savitribai phule birth anniversary in vijayawada: విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్‌లో సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవాలు కార్యక్రమం చేశారు. ‘ఉత్తములకు సత్కారం-అతిథులకు ఆహ్వానం’ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీనటుడు, కామెడియన్ బ్రహ్మానందం, సినీ నటి, సామాజిక కార్యకర్త రేణుదేశాయ్ హాజరయ్యారు. అలాగే బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా రేణుదేశాయ్ మాట్లాడారు. తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా పనిచేశారన్నారు. నేను ఈ విధంగా మాట్లాడేందుకు సావిత్రిబాయి పులే కారణమని చెప్పుకొచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని, సావిత్రిబాయి పులే జయంతి కార్యక్రమం అని చెబితేనే వచ్చినట్లు క్లారిటీ ఇచ్చారు. మహిళల చదువు కోసం ఆమె ఎంతో కృషి చేశారన్నారు. పిల్లలు తల్లిదండ్రులు కంటే ఉపాధ్యాయులతోనే ఎక్కువగా ఉంటారని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతిలోనే ఉంటుందని వెల్లడించారు.
అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఉపాధ్యాయులను గౌరవించాలని, అవార్డులను ఇవ్వాలని చెప్పడం చాలా మంచి నిర్ణయమన్నారు. మహిళల చదువుతోనే అభివృద్ది సాధ్యమైందన్నారు. గతంలో మహిళలకు చదువు అవసరం లేదని చెప్పేవారని గుర్తు చేశారు. కానీ సావిత్రిబాయి పులే చదువు ప్రాముఖ్యతను వివరించారన్నారు. బాల్య వివాహాలకు సైతం వ్యతిరేంగా పోరాడి చదువుకోవాలని ఎంతోమంది త్యాగాలు చేశారన్నారు. మచంద్ర యాదవ్ మంచి కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళా ఉపాధ్యాయులు హాజరయ్యారు.