Ramgopal Varma : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలిసిందే. ఎప్పుడు ఎదో ఒక అంశంపై తనదైన శైలిలో స్పందిస్తూ… సమాజంలో నెలకొన్న పరిస్థితులపై తన స్టైల్లో రియాక్ట్ అవుతుంటారు వర్మ. ఎవరి గురించి పట్టించుకోకుండా.. తనకు నచ్చినట్టుగా బతికేస్తుంటారు. తన మనసులోని మాటలను నిర్మొహమాటంగా బయపెడుతుంటారు ఆర్జీవీ. రామ్ గోపాల్ వర్మ అప్పుడప్పుడు తన పెళ్లి గురించిన ప్రస్తావన తెస్తూనే ఉంటారు. పెళ్లి పట్ల తనకి గల వ్యతిరేక భావాలను ప్రదర్శిస్తూనే ఉంటారు. తాజాగా ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ .. “ప్రేమలో ఉన్నప్పుడు కొన్ని విషయాలను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాము. పెళ్లి పేరుతో ఎప్పుడైతే ఒక రూఫ్ క్రిందికి వెళతామో అప్పుడు అన్నీ మారిపోతాయి .. అసలు రంగులు బయటికి వస్తాయి” అని అన్నారు.
“నాకు .. రత్నకి పెళ్లి జరిగిన తరువాత కూడా నేను ఇంటి పట్టున ఉన్నది చాలా తక్కువ. ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఒకసారి రత్న నా కాలర్ పట్టుకుని గోడకి అదిమి పట్టేసింది. అది చూసిన మా నాన్నగారు కంగారు పడిపోయి అరిచేశారు. నేను పెరట్లో నుంచి పారిపోయాను. రత్న ఎంతగా అరిచినా నేను పెద్దగా రియాక్ట్ అయ్యేవాడిని కాదు. ఒక మనిషి రియాక్ట్ కాకపోతే అవతల వ్యక్తికి మరింత కోపం వస్తుంది. అవతల వ్యక్తి నుంచి రెస్పాన్స్ రావాలనే ఉద్దేశంతో ఫిజికల్ గా గొడవపడటానికి రెడీ అవుతారు. రత్న చేసింది కూడా అదే. అలాంటప్పుడు తప్పించుకోవడానికి నేను పారిపోయేవాడిని. ఒకసారి మా బిల్డింగ్ పై నుంచి మరో బిల్డింగ్ పైకి దూకేసి మరీ వెళ్లిపోయాను. ఆ రాత్రంతా బంజారా హిల్స్ రోడ్లపై తిరుగుతూ గడిపేశాను” అంటూ చెప్పుకొచ్చారు.
నాకు సెంటిమెంట్‌లు లేవు.. అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, అక్క, అన్న ఇలాంటి బంధాలు బంధుత్వాలు అంటే నాకు చెడ్డ చిరాకు. అసలు ఆడది అంటే నాకు ముందుగా అందమే కనిపిస్తుంది. నో ఫ్యామిలీ, నో రిలేషన్స్ అందుకే నా కూతురు నన్ను అసహ్యించుకుంటుంది. నాకు కావాల్సింది కూడా అదే. ఈ లోకంలో నాకంటే పెద్ద ఎదవ ఎవడూ ఉండడు అంటూ తన గురించి తాను చెప్పుకుంటూనే ఉంటాడు రామ్ గోపాల్ వర్మ.
కాగా కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టుగా వర్మ గురించి అతని తల్లి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆర్జీవీ బాల్యం గురించి ఆయన తల్లి సూర్యవతి పలు షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఇటీవల తన తల్లి సూర్యవతితో కలిసి ఆర్జీవీ ఓ చానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఆర్జీవీ చిన్నప్పటి నుంచి చాలా మేధావి. ఇప్పుడు ఎలా ఉన్నాడో.. చిన్నప్పుడు కూడా అలానే ఉండేవాడు. మూడేళ్ల వయసులోనే తనకు ఏబీసీడీలు, వారాలు(సండే, మండే) చెబితే ఆ తర్వాత రోజే అన్ని అప్పజెప్పేవాడు. అప్పటికి స్కూల్లో చేరలేదు. నేను షాక్ అయ్యేదాన్ని. ఏకసంతా గ్రహి. అలాంటి వర్మ స్కూల్‌కు వెళ్లనని మారాం చేసేవాడు. కానీ స్కూల్ యూనిఫాం కొనిపెట్టగానే ఏం మాట్లాడకుండ స్కూల్‌కి వెళ్లిపోయేవాడు’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘‘స్కూల్‌కి వెళ్లి వచ్చాక టీచర్ నచ్చలేదనేవాడు. అలా అని ట్యూషన్ పెట్టిస్తే మాస్టర్‌కు ఏం రావట్లేదు అని చెప్పేవాడు. నాకు కోపం వచ్చి కొట్టేదాన్ని. ఇక స్కూల్లో ఎగ్జామ్స్‌లో ఒక్కోసారి వందకు తొంభైలు వచ్చేవి అని చెప్పుకొచ్చారు.