Ram charan Tej : దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం “ఆర్ఆర్ఆర్”. రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ మూవీలో.. ఆలియా భట్, ఒలీవియో హీరోయిన్లుగా నటించి మెప్పించారు. ఈ సినిమాలో కొమురం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. ముఖ్య పాత్రల్లో అజయ్ దేవగణ్, శ్రియా నటించగా.. కీరవాణి సంగీతం అందించారు. ఇక ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు వేదికల మీద తన సత్తా చాటుకుంది ఆర్ఆర్ఆర్. ఎన్నో అవార్డ్ లను కైవసం చేసుకుంది, ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ను కూడా సొంతం చేసుకుంది ఆర్ఆర్ఆర్. ఇక ఆస్కార్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు రామ్ చరణ్ తేజ్. ముఖ్యంగా హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సైతం రామ్ చరణ్ ని పొగడ్తలతో ముంచెత్తారు. ఇటీవల ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ పాత్ర గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ పాత్ర తనకు ఎంతో నచ్చిందంటూ కితాబిచ్చారు కామరూన్. కాకపోతే ఆ పాత్రను అర్ధం చేసుకోవడానికి కాస్త టైమ్ పడుతుందన్నారు. కానీ ఒకసారి ఆ పాత్ర అర్థమయ్యాక హృదయం బరువెక్కుతుందంటూ వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్, న్యూయార్క్ సిటీలో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్స్ కి నామినేట్ అయ్యింది. మార్చి 12న జరగనున్న ఈ ఈవెంట్ కోసం చరణ్ యూఎస్ వెళ్లాడు.
గుడ్ మార్నింగ్ అమెరికా షో కి గెస్ట్ గా చరణ్ (Ram charan Tej)..
అక్కడ ఏబీసీ ఛానెల్ నిర్వహించే బిగ్గెస్ట్ షో “గుడ్ మార్నింగ్ అమెరికా” షోలో పాల్గొడానికి చరణ్ కి ఆహ్వానం వచ్చింది. బుధవారం చరణ్, ఈ షోకి గెస్టుగా వెళ్లనున్నాడు. 1975 నుంచి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోకి అక్కడ మంచి డిమాండ్ ఉంది. మైఖేల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో రెండు గంటల పాటు ఎయిర్ అవుతుంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో పనిచేసిన అనుభవం.. ప్రస్తుతం, త్వరలో చేయబోతున్న ప్రాజెక్ట్‌ల గురించి చర్చించనున్నాడు.
అలాగే రామ్ చరణ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఇటీవల ఉపాసన గర్భవతి అని అఫిషియల్ గా ప్రకటించారు. దీంతో త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులు కాబోతుండడంతో మెగా ఫ్యామిలితో పాటు అభిమానులు కూడా వీరి పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు RC 15 మూవీ ఐదు ప్రధాన లొకేషన్స్ లో మాంటేజ్ సాంగ్ షూట్ జరుపుకుంది. హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి, కర్నూలు లోని ల్యాండ్ మార్క్ లొకేషన్స్ లో ఆ మాంటేజ్ సాంగ్ షూట్ జరిగింది. ఈ సాంగ్ కు సంబంధించిన ప్రతీ లొకేషన్ నుంచీ లీక్స్ ఓ రేంజ్ లో వచ్చి పడ్డాయి. అంతేకాదు ఈ పాట లిరిక్స్ కూడా కొద్దిగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/