Site icon Prime9

Ram charan – Upsana : ఉపాసన కోసం షాకింగ్ డిసిషన్ తీసుకున్న రామ్ చరణ్..అయోమయంలో ఫ్యాన్స్

ram charan shocking decision about upasana

ram charan shocking decision about upasana

Ram charan – Upsana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ పరంగా ఇప్పుడు మంచి హై లో ఉన్నారని చెప్పాలి. సినిమాల పరంగా చూస్తే  “ఆర్ఆర్ఆర్” సినిమాతో గ్లోబర్ స్టార్ గా మారిపోయాడు చరణ్. అలానే పర్సనల్ లైఫ్ పరంగా చూస్తే త్వరలోనే రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు.  కొంత కాలం క్రితమే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రకటించి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరారు. ఇటీవలే గోవాలో ఉపాసనకు అతికొద్ది మంది సన్నికితుల మధ్య సీమంతం లాంటి వేడుక కూడా జరుపుకున్నారు. చరణ్ – ఉపాసనలకు 2012 జూన్‌ 14న వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన ఈ వివాహం.. అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే చరణ్, ఉపాసన చెన్నైలో ఉండగా తొమ్మిదో తరగతి వరకూ ఒకే స్కూల్‌లో చదువుకున్నారు అనే విషయం తెలిసిందే. అయితే దాదాపు పెళ్లై పదేళ్లు అవుతున్న తరుణంలో మెగా ఫ్యామిలీలో ఈ రకమైన శుభవార్త చరణ్‌ జరగడంతో కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఉపాసన ప్రెగ్నెంట్ అనే విషయం ప్రకటించిన తర్వాత కూడా బాగా బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. ఒక వైపు శంకర్ సినిమా షూటింగ్.. మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ కాని.. ఆస్కార్ ఈవెంట్స్ కాని.. ఇలా వరుసగా బిజీగా ఉండటంతో ఉపాసనతో టైమ్ స్పెండ్ చేయలేక పోయాడు రామ్ చరణ్. దాంతో ప్రస్తుతం ఏడో నెల ప్రగ్నెంట్ గా ఉన్న ఉపాసన కోసం.. ఇక నుంచి టైమ్ కేటాయించాలి అని అనుకుంటున్నాడట రామ్ చరణ్. అందుకే ఇప్పటి నుంచి మరో మూడు నెలలు షూటింగ్స్ కు బ్రేక్ ఇవ్వాలని.. ఫిక్స్ అయ్యాడట.

ఇప్పటి నుంచే ఉపాసనకు సపోర్ట్ గా.. ఆమెతో పాటు ఉండాలని చెర్రీ ఫిక్స్ అయ్యారట. ముందు రెండు నెలలు.. బిడ్డ పుట్టిన తరువాత మరో నెల బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలి అనుకుంటున్నాడట చరణ్. ఇక చెర్రీ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్న ఈ జంటకు అభిమానులు అంతా అభినందనలు చెబుతున్నారు.

కాగా మరోవైపు రామ్ చరణ్ ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తుండగా శ్రీకాంత్, అంజలి , సునీల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. తమన్ ఈ మూవీకి సంగీతం అందించనుండగా.. మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

Exit mobile version