Site icon Prime9

Allu Arjun: సర్‌ప్రైజ్‌.. ఈ శుక్రవారమే థియేటర్లోకి వస్తున్న ‘పుష్ప’! – ట్విస్ట్‌ ఇచ్చిన మేకర్స్‌

Pushpa The Rise

Allu Arjun Pushpa The Rise Re Release in Theaters: ఇండియన్‌ మోస్ట్‌ అవైయిటెడ్ మూవీ ‘పుష్ప 2’. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్‌ మూవీ లవర్స్‌ అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇండియన్‌ సినిమాల్లో ఈ చిత్రానికి లేని బజ్‌ పుష్ప 2కి కనిపిస్తోంది. ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. అంతేకాదు వ్యూస్‌లో రికార్డులు నెలకొల్పింది. ఇప్పటికే ప్రీమియర్స్‌ అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌ ఒపెన్‌ అవ్వగా.. హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

ఓవర్సిస్‌లో ప్రీ సేల్‌లో వన్‌ మిలియన్‌ డాలర్లు చేసిన ఫాస్టెస్ట్‌ తెలుగు సినిమా పుష్ప 2 నిలిచింది. ఇదిలా ఉంటే ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ నార్త్‌లో ప్లాన్‌ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన రెస్పాన్స్‌ చూసి అంతా ఆశ్చర్యపోయారు. దాదాపు 2.6 లక్షల మంది ఈ కార్యక్రమానికి హాజరవ్వడం మరో రికార్డు. ఇలా పుష్ప 2కి ఉన్న క్రేజ్‌ చూసి మేకర్స్‌ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల ముందే పుష్ప థియేటర్లోకి తీసుకువస్తున్నట్టు గోల్డ్‌మైన్స్‌ టెలిఫిలింస్‌ అనే నిర్మాణ సంస్థ ప్రకటన ఇచ్చింది.

నవంబర్‌ 22న పుష్ప చిత్రాన్ని థియేటర్లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేసింది. అయితే పుష్ప పార్ట్‌ 2 కాదు పార్ట్‌ వన్‌ని. నార్త్‌ పుష్ప మూవీకి ఉన్న క్రేజ్‌తో అక్కడ నార్త్‌ మార్కెట్‌ను మరింత పెంచుకునేందుకు పుష్ప: ది రైజ్‌ని రీ రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది కేవలం హిందీ వెర్షన్‌ మాత్రమే రీ రిలీజ్‌ కానుంది. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో పుష్ప పార్ట్‌ వన్‌ రీ రిలీజ్‌పై ఉంటుందా? లేదా? అని క్లారిటీ లేదు. దీనిపై ఎలాంటి ప్రకటన కానీ, సమాచారం కాని లేదు. ఇది తెలిసి అభిమానులంతా సౌత్‌లోనూ పుష్ప 1ను రీ రిలీజ్‌ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఓవర్సిస్‌లోనూ పుష్ప పార్ట్‌ వన్‌ రీ రిలీజ్‌ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఎందుకంటే ఈ మూవీ రీరిలీజ్‌ బుక్కింగ్స్‌ త్వరలోనే ప్రారంభించనున్నట్టు ప్రత్యాంగిరా సినిమాస్‌ తమ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. ఇది తెలిసి నార్త్‌, ఓవర్సిస్‌ ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థపై నవీన్‌ యర్నేనీ, యలమంచిలి రవి శంకర్‌లు నిర్మించిన పుష్ప: ది రూల్‌ డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ పోలీసు ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడు. జగపతి బాబు, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌తో తదితర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version