Pushpa 2: హిందీలో ‘పుష్ప 2’ సరికొత్త రికార్డు – ఏకంగా షారుక్‌ ఖాన్‌నే వెనక్కి నెట్టిన అల్లు అర్జున్‌

  • Written By:
  • Updated On - December 10, 2024 / 05:35 PM IST

Pushpa 2 Hindi Collection: ప్రస్తుతం ‘పుష్ప 2’ భారీ వసూళ్లతో బాక్సాఫీసు షేక్‌ చేస్తోంది. రిలీజైన అన్ని ఏరియాల్లోనూ రికార్డు కలెక్షన్స్‌ రాబడుతుంది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో పుష్ప 2 ప్రభంజనం మామూలుగా లేదు. అత్యధిక వసూళ్లు రాబడుతూ దూకుడు చూపిస్తోంది. నాలుగు రోజుల్లోనే 280 పైగా నెట్‌ వసూళ్లు సాధించిన ఈ సినిమా ఐదు రోజుతో 300 కోట్ల క్లబ్‌లో చేరింది. అత్యంత తక్కువ టైంలో రూ. 300 కోట్లు సాధించిన ఫాస్టెస్ట్‌ సినిమా మన తెలుగు మూవీ అక్కడ సత్తాచాటింది. పుష్పరాజ్‌ దెబ్బకి ఖాన్స్‌ రికార్డ్స్‌ తుడిచిపెట్టింది. ఇలా బాలీవుడ్‌ అన్ని రికార్డ్స్‌ బ్రేక్‌ చేస్తూ పుష్ప 2 ఫుల్‌ జోరుతో దూసుకుపోతుంది.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్‌ 5న విడుదలై బ్లాక్‌బస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచే హిట్‌ టాక్ తెచ్చుకుంది. ముందు నుంచి మూవీ భారీ అంచనాలు ఉన్నాయి. రిలీజ్‌ తర్వాత పుష్ప 2 ఆ అంచనాలు మించి రెస్పాన్స్‌ అందుకుంటూ బాక్సాఫీసు వద్ద సునామీ కలెక్షన్స్‌ చేస్తుంది. ఈ క్రమంలో ఫస్ట్‌డే భారీ ఒపెనింగ్‌ ఇచ్చింది. రూ. 294 కోట్ల గ్రాస్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేసింది. ఇక హిందీలో రెండు తెలుగ రాష్ట్రాల్లో పోటీ వసూళ్లు చేస్తుంది.

విడుదలైన రెండో వారంలోకి అడుగుపెట్టిన అక్కడ అదే జోరు చూపిస్తుంది. ఐదవ రోజు అంటే సోమవారం పుష్ప 2 హిందీ బాక్సాఫీసు వద్ద రూ. 48 కోట్ల నెట్‌ రాబట్టింది. మొదటి రోజు రూ. 72 కోట్లు, రెండో రోజు రూ. 59 కోట్లు, మూడవ రోజు రూ. 74 కోట్లు, నాలుగవ రోజు రూ. 86 కోట్లు చేసి నాలుగు రోజుల్లో రూ. 286 గ్రాస్ కలెక్షన్స్‌ చేసింది. ఇక ఐదవ రోజు రూ. 48 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి మొత్తం రూ. 339 కోట్లు గ్రాస్‌ కలెక్షన్స్‌తో రికార్డుకు ఎక్కింది. ఇప్పటి ఏ హిందీ సినిమా చేయని వసూళ్లను అతి తక్కువ టైం పుష్ప 2 రాబట్టింది. బాలీవుడ్‌ అత్యధిక వసూళ్లు చేసిన సినిమా రికార్డు ఉన్న జవాన్‌ 300 కోట్లు రాబట్టడానికి 6 రోజులు టైం తీసుకుంది. మూడు వందల కోట్ల వసూళ్లు చేసిన ఫాస్టెస్ట్‌ సినిమాగా ఇప్పటి వరకు షారుక్‌ ఖాన్‌ జవాన్‌ ఉంది.

ఇప్పుడు పుష్ప 2 ఆ రికార్డును తుడిచిపెట్టేసింది. ఓ తెలుగు సినిమా బాలీవుడ్‌లో రికార్డులపై రికార్డులు నెలకొల్పడంతో అంతా టాలీవుడ్‌వైపే చూస్తున్నారు. హిందీలో మైలుస్టోన్‌ సాధించిన తెలుగు సినిమాగా పుష్ప 2 రేర్‌ రికార్డు నెలకొల్పింది. అక్కడ ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ చూసి ట్రేడ్‌ పండితులే సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఇదే విషయాన్ని షేర్ చేస్తూ ప్రముఖ మూవీ విశ్లేషకులు తరణ్‌ ఆదర్శ్‌ ఓ ట్వీట్‌ చేశారు. రెండో వారంలోనూ పుష్ప 2 400 కోట్ల మైలురాయి చేరువలో ఉందంటూ కామెంట్‌ చేశాడు. ఇక వరల్డ్‌ వైడ్‌గా ‘పుష్ప 2’ రూ. 900 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు చేసింది.