Site icon Prime9

Jai Hanuman: ‘జై హనుమాన్‌’లో రానా కూడా? – ప్రశాంత్‌ వర్మ ప్లానింగ్‌ మామూలుగా లేదుగా..

Rana in Jai Hanuman Movie

Rana Daggubati in Prasanth Varma Jai Hanuman: ‘హనుమాన్‌’ మూవీతో వెండితెరపై వండర్‌ క్రియేట్‌ చేశాడు ప్రశాంత్‌ వర్మ. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించింతో తెలిసిందే. తక్కువ బడ్జెట్‌లోనే అద్భుతమైన గ్రాఫిక్స్‌, వీఎఫ్‌ఎక్స్ విజువల్స్ చూపించి ఆడియన్స్‌ని మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించాడు. అలా రూ. 40 కోట్లతో రూపొందిన హనుమాన్‌ థియేట్రికల్‌ రన్‌లో రూ. 350 పైగా గ్రాస్‌ వసూళ్లు చేసింది. ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రశాంత్‌ వర్మ పేరు మారుమోగింది. భారత ఇతిహాసాలకు సూపర్‌ హీరోగా కాన్సెప్ట్‌ని జోడించి విజువల్‌ వండర్‌ చేశాడు.

విడుదలైన అన్ని భాషల్లో హనుమాన్‌కు ఆడియన్స్‌ బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రానికి కొనసాగింపుగా జై హనుమాన్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. హనుమాన్‌ బ్లాక్‌బస్టర్‌తో జై హనుమాన్‌ భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఫస్ట్‌ పార్ట్‌ శ్రీరాముడికి హనుమాన్‌ ఇచ్చిన మాట ఏంటనేది సస్పెన్స్‌లో ఉంచి అందరిలో క్యూరియాసిటీ పెంచాడు. రాముడు-హనుమాన్‌ చూట్టూ తిరిగే ఈ కథలో ఆ సూపర్‌ హీరో ఎవరనేది కూడా రివీల్‌ చేయకుండ మరింత హైప్ పెంచాడు. హనుమాన్‌ పాత్రలో కనిపించేది ఏ హీరో అని వాడివేడిగా చర్చ జరిగింది.

అంతేకాదు దీనిపై సస్పెన్స్‌ నెలకొనగా… ఇటీవల ఈ పాత్ర రివీల్‌ చేసి సందేహాలకు చెక్‌ పెట్టాడు ప్రశాంత్‌ వర్మ. జై హనుమాన్‌లో హనుమాన్‌ పాత్రకు కన్నడ డైరెక్టర్‌, కాంతార స్టార్‌ రిషబ్‌ శెట్టిని పోషిస్తున్నట్టు వెల్లడించారు. అంతేకాదు హనుమాన్ పాత్రలో ఉన్న ఆయన పోస్టర్‌ని కూడా రిలీజ్‌ చేసి అందరిని సర్‌ప్రైజ్‌ చేశాడు. దీంతో మూవీపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు రిషబ్‌ శెట్టితో హీరో రానా దిగిన ఫోటో షేర్‌ చేసి మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. రిషబ్‌ శెట్టి, రానాలతో ప్రశాంత్‌ వర్మ దిగిన ఫోటో షేర్‌ చేశాడు. దీనికి ‘జై జై హనుమాన్‌!!’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇప్పటికే రిషబ్‌ శెట్టి ఎంట్రీతో జై హనుమాన్‌పై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ఇప్పుడు రానా పేరు వినిపించడం మరింత హైప్‌ క్రియేట్‌. ఇప్పుడు సోషల్‌ మీడియాలో మొత్తం జై హనుమాన్‌ గురించే చర్చ జరుగుతుంది. ఇందులో రానా రాముడు పాత్ర పోషిస్తున్నారా? రావణుడు? పోషిస్తున్నాడా? అంతా కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ సినిమా రానా కూడా ఉన్నాడంటే ఖచ్చితంగా ఏదో మలుపు తిప్పే పాత్రే అయి ఉంటుందని అందరు అంచనాలు వేసుకుంటున్నారు. మరి రానా జై హనుమాన్‌లో ఏదైనా కీలక పాత్ర పోషిస్తున్నాడా? లేక రిషబ్‌ శెట్టి డబ్బింగ్ చెబుతన్నాడా? అనేది క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఏదేమైనా రానా ఎంట్రీ మరోసారి జై హనుమాన్‌ ట్రెండింగ్‌లో నిలిచింది.

Exit mobile version