Site icon Prime9

Prabhas: ప్రభాస్‌ బర్త్‌డే – రేర్ ఫోటోలు షేర్ చేసిన కృష్ణంరాజు కూతురు, ఆకట్టుకుంటున్న పోస్ట్‌

Sai Praseedha Shared Prabhas Photos

Sai Praseedha shared Rare Photos of Prabhas: పాన్‌ ఇండియా స్టార్‌, బాక్సాఫీసు రారాజు ప్రభాస్‌ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ సెలబ్రిటీస్‌, ఫ్యాన్స్ నుంచి సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవి ఊహించని విధంగా విషెస్‌ తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ఈ సందర్బంగా డార్లింగ్‌కు బర్త్‌డే విషెస్‌ చెబుతూ ఇలా అన్నారు. “ఆ కట్‌ అవుట్‌ చూసి అన్ని నమ్మేయాలి డూడ్‌! అతను ప్రేమించే పద్దతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. హ్యాపీ బర్త్‌డే డార్లింగ్‌ ప్రభాస్‌. మీతో ఎల్లప్పుడు ప్రేమ, సంతోషం, కీర్తి ఉండాలని ఆశిస్తున్నాను. ఈ సంవత్సరం మీకు మరింత అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నా” అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు. దీంతో చిరు పోస్ట్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది.

అలాగే ప్రభాస్‌ సోదరి, కృష్ణంరాజు కూతురు సాయి ప్రసీద తన అన్నయ్య స్పెషల్‌ బర్త్‌డే విషెస్ తెలిపింది. ఈ సందర్భంగా ప్రభాస్‌కు సంబంధించిన రేర్ ఫోటోలు షేర్‌ చేసింది. చిన్నప్పటి నుంచి ప్రభాస్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పలు ఫోటోలు షేర్‌ చేస్తూ.. హ్యాపీ బర్త్‌డే టూ మై ఫరెవర్‌ ఫేవరేట్‌. లవ్‌ యూ అన్నయ్య” అంటూ ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ప్రసీద షేర్‌ చేసిన ఫోటోలో సీనియల్‌ రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు కూడా ఉండటంతో ఫ్యాన్స్‌కి ఈ బర్త్‌డేకు డబుల్‌ ట్రీట్‌ అందింది.


కాగా కృష్ణంరాజుకు నలుగురు ఆడపిల్లలనే విషయం తెలిసిందే. చెల్లెళ్లంటే ప్రభాస్‌కు చాలా ఇష్టం. ఇటీవల నిర్మాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రసీద.. అప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్స్‌ షేర్‌ చేస్తుంది. ఇప్పుడు ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా ఆమె పలు చిన్ననాటి ఫోటోలు షేర్‌ చేసి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా ఇటీవల ప్రభాస్‌ కల్కి 2898 ఏడీ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు. సలార్‌, కల్కి వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రభాస్‌ ప్రస్తుతం సలార్‌ 2, మారుతి దర్శకత్వంలో రాజాసాబ్‌ చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మరోవైపు సందీప్‌ రెడ్డి వంగాతో స్పిరిట్‌, సీతారామం ఫేం హను రాఘవపూడితో ఓ సినిమాకు కమిట్‌ అయ్యాడు. ఇవి త్వరలోనే సెట్స్‌పైకి రానున్నాయి. ఇలా వరుస పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌తో ప్రస్తుతం ప్రభాస్‌ ఫుల్‌ బిజీగా ఉన్నాడు.

Exit mobile version