Site icon Prime9

Restrictions: విజయవాడలో టపాసుల అమ్మకాలపై పోలీసు ఆంక్షలు..దుకాణాలు బంద్ చేయాలని హుకుం

Police restrictions on the sale of crackers in Vijayawada

Police restrictions on the sale of crackers in Vijayawada

Vijayawada: ఏపీ పోలీసుల తీరు ఏ విధంగా సమర్ధనీయంగా ఉండడం లేదు. తాజాగా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొన్న చందంగా విజయవాడ దీపావళి టపాకాయలు అమ్మే వ్యాపారులపై పోలీసులు పడ్డారు. సాయంత్రం 6 దాటింది ఇకపై టపాసులు అమ్మేందుకు వీలులేదని ఆంక్షలు విధించారు.

టపాసులు విక్రయించే గ్రౌండ్ లోపలకు‌ వెళ్లకుండా వినియోగదారులను పోలీసులు బయటకి పంపేస్తున్నారు. గాంధీనగర్‌లోని జింఖానా ప్రాంగణం, సత్యనారాయణపురంలోని ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాల, అజిత్‌సింగ్‌ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో షాపులను ఏర్పాటు చేశారు. జింఖానా ప్రాంగణంలో మొత్తం 19 షాపులకు స్థలాన్ని కేటాయించారు. అయితే అగ్ని ప్రమాదం చోటుచేసుకొన్న కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. దీంతో అధికారులు ముందస్తుగా ఆదేశాలు ఇచ్చారని, వెంటనే దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు పేర్కొంటున్నారు.

ఎవరూ అమ్మకాలు, కొనుగోళ్లు జరపవద్దని పదే పదే పోలీసులు విజ్నప్తి చేస్తున్నారు. అధికారుల నిర్ణయంపై వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరి రెండు, మూడు గంటలు జరిగే బిజినెస్ పోవడంతో నష్టపోతామని వ్యాపారులు వాపోతున్నారు. ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా హఠాత్తుగా దుకాణాలు బంద్ చేస్తే నష్ట పోతామని వ్యాపారులు గొల్లుమంటున్నారు.

ఇది కూడా చదవండి: Vishnuvardhan Reddy: పెట్రోల్ బంకు పక్కనే….టపాసులు అమ్మేందుకు ఎలా అనుమతి ఇచ్చారు…ప్రశ్నించిన భాజపా నేత విష్ణువర్దన రెడ్డి

Exit mobile version