Farm House Case: ఫాంహౌజ్‌ రేవ్‌ పార్టీ – కేటీఆర్‌ బావమరిదికి పోలీసు నోటీసులు, హైకోర్టును ఆశ్రయించిన రాజ్‌పాకాల

  • Written By:
  • Updated On - October 28, 2024 / 01:32 PM IST

Police Sends Notice to Raj Pakala: జన్వాడ ఫాంహౌజ్‌ రేవ్‌ పార్టీ వ్యవహరం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. ఈ కేసులో కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ బీఎన్‌ఎస్‌ఎస్‌ 35(3) సెక్షన్‌ ప్రకారం మోకిల పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ రోజు విచారణకు హజరు కావాలని, లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.

అయితే రాజ్‌పాకాల పోలీసుల నోటీసులకు స్పందించకపోవడంతో రాయదుర్గంలోని ఓరియన్‌ విల్లాస్‌లో అతడి నివాసానికి నోటీసులు అతికించారు. దీంతో అజ్ఞాతంలో ఉన్న రాజ్‌ పాకాల నోటీసుల దెబ్బకు వెలుగులోకి వచ్చారు. పోలీసుల నోటీసులపై తాజాగా ఆయన హైకోర్టు ఆశ్రయించారు. పోలీసులు అక్రమంగా తనని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని, తనను అరెస్టు చేయకుండ ఆదేశాలివ్వాల్సిందిగా కోర్టులో అత్యవసర పటిషన్‌ దాఖలు చేశాడు. రాజ్‌పాకాల పటిషన్‌పై సోమవారం మధ్యాహ్నం జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డి విచారణ జరపనున్నారు.