Site icon Prime9

Tirupati: తిరుపతిలోని ప్రముఖ హోటళ్లకు బాంబు బెదిరింపులు – అప్రమత్తమైన పోలీసులు

Tirupati Hotels Receive Bomb Threat: తిరుపతిలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. అలిపిరి పోలీసు స్టేషన్‌ పరిధిలోని పలు హోటళ్లకు వరుసగా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడ తనిఖీలు చేపట్టారు. కాగా గత రెండు రోజులుగా వరుసగా తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. కాగా లీలామహల్‌ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామనుజ కూడలిలోని ఓ హోటల్‌కు కూడా మెయిల్‌ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది.

ఐఎస్‌ఐ పేరుతో శనివారం రాజ్‌ పార్క్‌, పాయ్‌ వైస్రాయ్‌ హోటళ్లకు మెయిల్‌ ద్వారా బెదిరింపులు వచ్చాయి. అయితే రష్యన్‌, మలేషియాకు చెందిన 25 మంది మహిళలు శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుపతికి వచ్చారు. వారు ఇవే హోటల్లో బస చేస్తున్న  క్రమంలో నేడు తెల్లవారు జామున ఉదయం 5:30 గంటలకు ఐఎస్‌ఐ పేరుతో మెయిల్‌ ద్వారా హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడం డాగ్ స్క్వాడ్‌తో సహా ప్రత్యేక పోలీసు బృందాల రంగంలోకి హోటళ్లల్లో పరిసర ప్రాంతాలు సోదాలు నిర్వహించారు. అయితే ఇప్పటికే పేలుడుకు సంబంధించిన ఎలాంటివి లభ్యం కాలేదు. టెంపుల్‌ సిటీ అయిన తిరుపతికి ఇలా వరుసగా బాంబు బెదిరింపులు వస్తుండటంతో స్థానికులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version