Pharmacy Student Delivers Baby Girl at social welfare Hostel in Guntur district: 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని హాస్టల్లో ఆడబిడ్డకు జన్మనివ్వడం తీవ్ర కలకలం రేపింది. గుంటూరు సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన విద్యార్థిని హాస్టల్లో తన తోటి విద్యార్థిని సహకారంతో ప్రసవించింది. ఈ క్రమంలో బాధిత విద్యార్థినికి తీవ్ర రక్తస్రావం కాగా, హాస్టల్ సిబ్బంది, అధికారులు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి జయప్రదను సస్పెండ్ చేశారు. ఘటనపై విచారణకు ఉన్నతాధికారులు ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
సమీప బంధువే కారణం..
సమీప బంధువైన ఓ యువకుడు విద్యార్థిని గర్భానికి కారణమని తెలుస్తోంది. బంధువుల సమక్షంలో త్వరలో వీరి వివాహం జరగనుందని సమాచారం. విద్యార్థినిని గర్భవతిని చేసిన యువకుడిపై కేసు నమోదు చేశారు. విద్యార్థిని 9 నెలలపాటు గర్భంతో ఉన్నా సిబ్బంది కనిపెట్టలేదని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.