Pawan Kalyan to Meet with CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. అమరావతిలోని ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుతో పవన్ లంచ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ మేరకు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంటుందని రాజకీయ ప్రముఖులు భావిస్తున్నారు.
కాగా, ఇటీవల కాకినాడ పోర్టులో దొరికిన బియ్యం అక్రమ రవాణా అంశంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే తాజా, రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం ఉంది. సోషల్ మీడియా పోస్టుల కేసులు, నామినేటెడ్ పదవులపై సమావేశంలో చర్చించనున్నారు. తన ఢిల్లీ పర్యటన అంశాలను సీఎం చంద్రబాబుకు పవన్ వివరించనున్నారు.
ఇదిలా ఉండగా, ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టును స్వయంగా సందర్శించిన సంగతి తెలిసిందే. అయితే కాకినాడ పోర్టులో అంతకుముందు పట్టుబడిన రేషన్ బియ్యంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనంతరం అధికారులపై కూడా మండిపడ్డాడు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీలో పలు అంశాలను చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే బియ్యం అక్రమ రవాణాపై పవన్ కల్యాణ్ చాలా సీరియన్‌గా తీసుకున్నట్లు సమాచారం.