Site icon Prime9

Slumdog Millionaire: 8 ఆస్కార్‌ అవార్డులు గెలిచిన సినిమా – 16 ఏళ్ల తర్వాత సీక్వెల్‌కు రెడీ!

Slumdog Millionaire Sequel Details: ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. 2008లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఓ సినిమాకు భాష పరమైన హద్దులు లేవని నిరూపించిన చిత్రమిది. భాషతో సంబంధం లేకుండా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఏకంగా 8 విభాగాల్లో ఆస్కార్‌ అవార్డు గెలిచి సన్సేషన్‌ అయ్యింది. 16 ఏళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు సీక్వెల్‌కు రెడీ అవుతుంది.

ఇటీవల ప్రారంభమైన హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ బ్రిడ్జ్‌ 7 ఈ మూవీ సీక్వెల్‌ హక్కులను సొంతం చేసుకున్నట్టు ది హాలీవుడ్‌ రిపోర్టు తెలిపింది. ఈ సినిమాకు డానీ బాయిల్‌ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా సీక్వెల్‌ ప్రకటన సందర్భంగా డైరెక్టర్‌ మాట్లాడుతూ.. “కొన్ని కథలు ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంటాయి. ఎన్నేళ్లయిన అవి ఆసక్తిగానే ఉంటాయి. అలాంటి వాటిల్లో స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ చిత్రం ఒకటి. మంచి కథకు భాషాపరమైన హద్దులు ఉండవని ఈ చిత్రం రుజువు చేసింది” అని అన్నారు.

కాగా ముంబై మురికివాడల్లో నివసించే చిన్నారుల జీవనం ఆధారంగా స్లమ్‌డాగ్ మిలియనీర్‌ తెరకెక్కింది. మురికివాడల్లో నివసించే ఆ చిన్నారుల్లోని ప్రతిభను ఈ సినిమాలో చూపించారు. అలాంటి వాతావరణంలో పెరిగిన బాలుడు తన తెలివితేటలతో కోన్‌ బనేగా కరోడ్‌పతి షోకు ఎలా వెళ్లాడు.. ఈ షోలో 2 కోట్లు ఎలా గెలుచుకున్నాడనేది ఈ స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ కథ. 2008తో విడుదలైన ఈ చిత్రం ఆ ఏడాది ఆస్కార్‌ అవార్డుకు 10 క్యాటగిరిలో నామినేషన్‌లో నిలవగా… ఏకంగా 8 విభాగాల్లో ఈ అవార్డును గెలుచుకుంది. అలాగే నాలుగు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌నిక కూడా గెలుచుకుంది.

Exit mobile version