Site icon Prime9

Oscar 2025: ఇండియన్‌ షార్ట్‌ ఫిలిం అరుదైన ఘనత – ఆస్కార్‌కు అర్హత సాధించిన ‘సన్‌ప్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్‌ వన్‌ టు నో’

Sunflowers Were the First Ones to Know Short Film: ఇండియన్‌ షార్ట్ ఫలింకు అరుదైన ఘనత సాధించింది. ఆస్కార్‌ 2025 (Oscar 2025)కి ఇది అర్హత సాధించింది. ఈ విషయాన్ని మూవీ నిర్మాత ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. ఆ షార్ట్‌ ఫిలిం పేరు ‘సన్‌ప్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్‌ వన్‌ టు నో’. చిదానందం తెరకెక్కించిన ఈ లఘు చిత్రం 2025 ఆస్కార్‌ బరిలో నిలిచిందని తెలుపుతూ నిర్మాత ట్వీట్‌ చేశారు. ” ‘సన్‌ప్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్‌ వన్‌ టు నో’ లైవ్‌ యాక్షన్‌ కేటగిరిలో అర్హత సాధించింది” అంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు. దీంతో ఈ షార్ట్‌ ఫిలం టీంకు ఇండస్ట్రీవర్గాలు, నెటిజన్స్‌ అభినందనలు తెలుపుతున్నారు.

16 నిమిషాల నిడివి గల ఈ షార్ట్‌ ఫిలింను కన్నడ జానపథ కథ ఆధారం రూపొందించారు. దీని కథ విషయానికి వస్తే.. వృద్ధురాలి, కోడికి ఉన్న ఎమోషనల్‌ బాండింగ్‌ చూట్టూ కథ తిరుగుతుంది. ఓ వృద్ధురాలి కోడిని ఎవరో దొంగలిస్తారు.. దానికి కనిపెట్టడం కోసం ఆమె పడే తపన, ఆ కోడితో ఆమెకు ఉన్న బాండింగ్‌ని ఇందులో చక్కగా చూపించారు. ఓ ఎమోషనల్‌ రైడ్‌గా సాగే ఈ షార్ట్‌ ఫిలిం మంచి ఆదరణ దక్కించుకుంది. ఆడియన్స్‌ నుంచి ఊహించని రెస్పాన్స్‌ అందుకున్న ఈ షార్ట్‌ ఇటీవల కేన్స్‌-2024లోనూ ఉత్తమ లఘుచిత్రంగా అవార్డును కూడా దక్కించుకుంది.

హాలీవుడ్‌ షార్ట్స్‌ ఫిలింతో పోటీపడి మొదటి బహుమతి గెలుచుకుంది. వివిధ భాషలకు చెందిన మొత్తం 17 షార్ట్స్‌ కేన్‌-2024లో పోటీ పడగా.. వాటన్నింటిని వెనక్కి నెట్టి ఇది ఫస్ట్‌ప్లేస్‌ దక్కించుకుని అవార్డును సొంతం చేసుకుంది. అదే విధంగా బెంగళూరు ఇంటర్నేషనల్‌ షార్ట్‌ ఫిలిం ఫెస్టివల్‌లోనూ టాప్‌లో నిలిచి బహుమతి గెలుచుకున్న సన్‌ప్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్‌ వన్‌ టూ ఇప్పుడు ఆస్కార్‌ బరిలో నిలవడం విశేషం. కర్ణాటక మైసూర్‌కు చెందిన నాయక్‌ ఈ సినిమాను నిర్మించారు.
ఇంటర్నేషనల్ అవార్డులు, ఎంతో మంది ప్రేక్షకాదరణ పొందిన ఈ షార్ట్‌ ఫిలిం ఆస్కార్‌ అవార్డు కూడా గెలవడం ఖాయమని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే ఇండియన్‌ సినిమా నుంచి బాలీవుడ్‌ హిట్‌ మూవీ ‘లాపతా లేడీస్‌’ ఆస్కార్‌ 2025కి ఎంపికైన విషయం తెలిసిందే. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ మాజీ భార్య కిరణ్‌ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుని బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. అంతేకాదు ఎంతోమంది సినీ ప్రముఖుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సినిమా వచ్చిన ఆదరణ నేపథ్యంలో ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ చిత్రాన్ని ఆస్కార్‌కు పంపించింది.

Exit mobile version