Site icon Prime9

Bathukamma: వెన్నముద్దల బతుకమ్మ.. జీవితంలో వెలుగులు నింపమ్మ

eighth day of bathukamma celebrations

eighth day of bathukamma celebrations

Bathukamma: బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీక. తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకునే అతిపెద్ద పండుగ దసరా. ఈ ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు ప్రకృతిని పూజిస్తూ వివిధ రకాల పువ్వులతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను తమ ఇంటి ఆడపిల్లలా అక్కచెల్లెమ్మలు పూజిస్తారు. ఈ తొమ్మిరోజుల పాటు తొమ్మిది రకాల బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో వివిధ రకాల నైవేథ్యాలతో ప్రతీ వీధివీధిలో బతుకమ్మ సందడి నెలకొంటుంది. ఎటు చూసిన వీధులన్నీ పూలమయం అయ్యి కనిపిస్తాయి. సంప్రదాయ వస్త్రాలంకరణలో మహిళలు చూడముచ్చటగా కనిపిస్తారు.

వర్షాకాలం ముగింపులో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ప్రతి ఏటా ఈ పండుగను జరుపుకుంటారు. కాగా ఈ ఏడాది సెప్టెంబరు 25 నుంచి బతుకమ్మ పండుగ సంబరాలు మొదలయ్యాయి. ప్రతి ఏటా అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మతో ఈ వేడుకలు ప్రారంభమయ్యి తొమ్మిదోరోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ పండుగ వేళ ముఖ్యంగా ఈ సీజన్లో దొరికే సహజసిద్దమైన పూలతో బతుకమ్మను అలంకరించి, వివిధ రకాల ప్రసాదాలు సమర్పించి గౌరీదేవిని పూజిస్తారు. తంగేడు పూలు, గునుగు పూలు, గుమ్మడి పూలు, గోరంట్ల పూలు, మందారపువ్వులు వంటి వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి పూల మధ్యలో పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచి మహిళలు అమ్మవారిని పూజిస్తారు. ఇక ఎనిమిదవ రోజున వెన్నముద్దల బతుకమ్మను చేసి పూజిస్తారు. తంగేడు, గునుగు, చామంతి, గులాబి, గుమ్మడిపూలతో బతుకమ్మను పేర్చుతారు. ఈ రోజు ప్రసాదంగా అమ్మవారికి వెన్నముద్దలను చేసి వాయనంగా పంచిపెడతారు.

ఇదీ చదవండి: ఆ ఆలయమంతా డబ్బు, బంగారమే..!

Exit mobile version