Site icon Prime9

Robinhood Teaser: డబ్బు కోసం వాడు ఎవ్వరికైనా ఎదురు వెళతాడు – ఆకట్టుకుంటున్న ‘రాబిన్‌ హుడ్‌’ టీజర్‌

Robinhood Teaser Out: నితిన్‌ హీరోగా వెంకి కుడుముల దర్శకత్వంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాబిన్‌ హుడ్‌’. భీష్మ వంటి హిట్‌ మూవీ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రమిది. దీంతో ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో నితిన్‌ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌ సంగీతం అందిస్తున్నారు. మొదటి నుంచి ఈ సినిమా అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌ మంచి బజ్‌ క్రియేట్‌ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్‌ విడుదల చేశారు మేకర్స్‌. 1:34 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌ కామెడీ, యాక్షన్‌తో ఆద్యాంతం ఆసక్తిగా సాగింది.

“ఆగని హైఫై ఇళ్లలో చోరీ”లు అంటూ బ్యాగ్రౌండ్‌తో టీజర్‌ మొదలైంది. “ఇంతమంది దాచుకున్న హనీని దోచుకుపోతున్న హనీ సింగ్‌ ఎవరూ” అంటూ న్యూస్‌ డైలాగ్‌తో టీజర్‌ ఆసక్తి పెంచుతోంది. రాబిన్ హుడ్‌.. వాడికి పర్టిక్యూలర్‌ జెండా.. ఎజెండ్‌ ఏం లేవు.. డబ్బు కోసం వాడు ఎవ్వరికైనా ఎదురెలతాడు” అనే డైలాగ్‌ ఆకట్టుకుంది. టీజర్ చూస్తుంటే అవినితీగా డబ్బు సంపాదిస్తున్న రాజకీయ నాయకుల డబ్బును టార్గెట్‌ చేస్తూ వాటిని దోచుకేళ్లడమే హీరో క్యారెక్టర్‌ అనిపిస్తోంది. టీజర్‌ మధ్యలో రాజేంద్రప్రసాద్‌తో నితిన్‌ కామెడీ బాగా ఆకట్టుకుంది. మొత్తానికి రాబిన్‌ హుడ్.. డబ్బు చూట్టు తిరిగే ఓ యువకుడి కథ అని తెలుస్తోంది. సస్పెన్స్‌ థ్రిల్లింగ్‌, కామెడీతో రాబిన్‌ హుడ్‌ టీజర్‌ ఆసక్తిగా సాగింది. కాగా ఈ సినిమా డిసెంబర్‌ 25న విడుదల కానుంది.

Exit mobile version