Site icon Prime9

Appudo Ippudo Eppudo Trailer: ఇద్దరు అమ్మాయిలతో నిఖిల్‌ లవ్‌ట్రాక్‌ – ఆసక్తి పెంచుతున్న ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ట్రైలర్‌

Appudo Ippudo Eppudo Trailer Out: యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా రుక్మిణి వసంత్‌, దివ్వాంశ కౌశిక్‌ హీరోయిన్లకు నటిస్తున్న చిత్రం ‘ప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను SVCC బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. సుధీర్‌ వర్మ-నిఖిల్‌లది హిట్‌ కాంబో. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘స్వామిరారా’, ‘కేశవ’ చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబో వస్తున్న మూడో చిత్రమిది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

నవంబర్‌ 8న ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా ట్రైలర్‌ తాజాగా రిలీజ్‌ చేసింది మూవీ టీం. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్‌ అందుకుటుంది. ట్రైలర్‌లో చూపించిన ప్రకారం ఈ సినిమాలో నిఖిల్‌ కారు రేసర్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఒకసారి ఇద్దరు హీరోయిన్ల లవ్‌ట్రాక్, రొమాన్స్‌, యాక్షన్‌తో ట్రైలర్‌ ఆసక్తిగా సాగింది.

ట్రైలర్‌లో ఏముందంటే!

కారు రేసింగ్‌, లండన్‌ బ్రిడ్జి లోకేషన్‌ వంటి ఆసక్తికర సీన్స్‌తో ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత కారు డ్రైవ్‌ చేస్తున్న నిఖిల్‌ని చూపిస్తూ.. రేసర్‌ అవ్వాలనేది వీడి కల అని బ్యాగ్రౌండ్ వాయిస్‌ వస్తుంది. అయితే తన కలను నిజం చేసుకునేందుకు డబ్బులు కావాలి. కాబట్టి అవసరం కోసం డబ్బు ఉన్న తార (రుక్మిణి వసంత్‌) అనే అమ్మాయిని ప్రేమించినట్టు చూపిస్తారు. ఆమెకు ఐ లవ్‌ యూ చెప్పడం.. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకోవడమే కాదు.. ఒకరోజు గుడిలో ఆమె మెడలో తాళి కూడా కట్టినట్టు చూపించారు. అదే డబ్బు అవసరం కోసం మరో అమ్మాయితోనూ లవ్‌ట్రాక్‌ నడిపిస్తాడు.

ఇంకా డబ్బు కోసం పార్ట్‌టైంగా లండన్‌లో చిన్న చిన్న నేరాలు కూడా చేసినట్టు చూపించారు. ఈ క్రమంలో అనుకోకుండా ఓ హత్య కేసులో ఇరుక్కోవడం.. లండన్ పోలీసులు నిఖిల్, వైవా హర్షల వెంటపడటం వంటి అంశాలతో ట్రైలర్‌ ఆసక్తిగా సాగింది. అంతేకాదు ఓ మాఫియా కూడా డివైస్‌ ఎక్కడా? అంటూ నిఖిల్‌ ప్రశ్నించడం ఆసక్తిని పెంచుతోంది. ఇంతకి ఆ హత్య చేసింది ఎవరూ? ఆ డివైస్‌లో ఏముంది? అనేది సస్పెన్స్‌ నెలకొంది. ఇక ట్రైలర్‌ చివరిలో కమెడియన్‌ సత్య, సుధాకర్‌ల కామెడీ ట్రైలర్‌కి హైలెట్‌గా అని చెప్పాలి. ఇలా రొమాన్స్, యాక్షన్‌, క్రైంతో అప్పుడో ఎప్పుడో ట్రైలర్‌ ఆద్యాంతం ఆసక్తిగా సాగింది. మొత్తానికి ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ, క్రైం, యాక్షన్‌ వంటి అంశాలతో సాగిన ఈ ట్రైలర్‌ మూవీపై అంచనాలు పెంచేస్తోంది.

Exit mobile version