Nandamuri Family : నందమూరి కుటుంబంలో వరుస విషాదలు చోటు చేసుకుంటున్నాయి.
ఇటీవలే నందమూరి తారకరత్న పాదయాత్రలో గుండెపోటుతో పడిపోయి చికిత్స తీసుకుంటున్నారు.
ఆయన ఇంకా కోలుకోక ముందే నందమూరి కుటుంబంలో మరో ప్రమాదం నెలకొంది.
సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ తాజాగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారని తెలుస్తుంది.
ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-10 లో వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగిందని సమాచారం అందుతుంది. ఈ ప్రమాదంలో రామకృష్ణకు స్వల్పగాయాలయ్యాయి. కానీ కారు మాత్రం పూర్తిగా నుజ్జు నుజ్జు అయినట్లు కనబడుతుంది. చికిత్స అనంతరం ప్రస్తుతం రామకృష్ణ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. అయితే ఈ విషయంపై నందమూరి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వరుసగా నందమూరి కుటుంబలో విషాదాలు చోటు చేసుకోవడం పట్ల వారి అభిమనులంతా ఒకింత నిరాశకి గురవుతున్నారు.
(Nandamuri Family) నందమూరి ఫ్యామిలీలో గతంలో వారికి కూడా..
ఇక గతంలో కూడా నందమూరి హరికృష్ణ, నందమూరి జానకీరామ్‌లు కారు యాక్సిడెంట్ లోనే తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అలానే జూనియర్ ఎన్టీఆర్ కి కూడా యాక్సిడెంట్ అవ్వడం.. ఇప్పుడు నందమూరి రామకృష్ణ కార్ యాక్సిడెంట్ అవ్వడం.. ఇవన్నీ చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే దీనిపై పోలీసులు కూడా ఎటువంటి కేసు నమోదు చేయలేదని.. యాక్సిడెంట్ కి గురైన కారుని కుటుంబ సభ్యులు తీసికెళ్ళిపోయారని సమాచారం అందుతుంది.
తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ గతనెలలో కుప్పం నుంచి నిర్వహించిన ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వెంటనే కుప్పంలో ట్రీట్ మెంట్ అందించారు. అప్పటికే గుండెపోటుకు గురైనట్టు గుర్తించి చేయాల్సిన చికిత్స చేశారు. ఇక మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హ్రుదయాలయ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు క్షణక్షణం తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
బాలయ్య, కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడూ తారకరత్న ఆరోగ్యంపై వైద్యులను ఆరాతీస్తూనే ఉన్నారు. చికిత్స స్పందిస్తున్నారని తెలిపారు. అయినా ఇంకా క్రిటికల్ స్టేజీలోనే ఉన్నారన్నారు. పదిరోజులకు పైగా చికిత్స పొందుతున్న తారకరత్న హెల్త్ పై తాజాగా హీరో కళ్యాణ్ రామ్ స్పందించారు. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. తారకరత్నకు బెస్ట్ ట్రీట్ మెంట్ అందుతోంది. డాక్టర్లు నిత్యం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా కావాల్సిన ఏర్పాట్లు చూస్తున్నారు. త్వరలో కోలుకుంటారని భావిస్తున్నాను. ఈమేరకు దేవుడిని ప్రార్థిస్తున్నాం. తారకరత్న హెల్త్ పై డాక్టర్లు అప్డేట్ ఇస్తే బాగుంటుంది. మీ అందరి ఆశీస్సులతో కోలుకుంటారని ఆకాంక్షిస్తున్నాం.’ అని వివరించారు. కొద్దిరోజులుగా తారకరత్న హెల్త్ అప్డేట్ రాలేదు. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తరలించనున్నామని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రస్తుతం తారకరత్న ఎలా ఉన్నారనేది తెలియాల్సి ఉంది
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/