Site icon Prime9

Thandel: నాగచైతన్య ‘తండేల్‌’ రిలీజ్‌పై డైలమా – పుకార్లకు చెక్‌ పెట్టనున్న మూవీ టీం

Naga Chaitanya Thandel Release Date: హీరో నాగచైతన్య, నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి నటించి మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ తండేల్‌. నిజ జీవిత సంఘటన ఆధారం చందు మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రమిది. గీతా ఆర్ట్స్‌ బ్యానర్పై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా చాలా గ్యాప్‌ తర్వాత నాగ చైతన్య నుంచి వస్తున్న సినిమా కావడంలో అక్కినేని ఫ్యాన్స్‌ తండేల్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌, గ్లింప్ప్‌ మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ చేశాయి. ఇక ఈ సినిమాను డిసెంబర్‌ 20న గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు. కానీ, అప్పుడే పుష్ప 2 కూడా ఉండటంతో మూవీ వాయిదా పడింది. కానీ కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడనేది ఇంకా స్పష్టం చేయలేదు. ఈ క్రమంలో తండేల్‌ రిలీజ్‌ ఆడియన్స్‌ రకరకాల సందేహాలు నెలకొన్నాయి. సంక్రాంతికి అయిన వస్తుందనుకుంటే ‘గేమ్ ఛేంజర్‌’ ఉంది. చూస్తుంటే పండగ బరిలోనూ తండేల్‌ ఉండేలా కనిపించడం లేదు. ఇక తండేల్‌ రిలీజ్‌ అయ్యేది 2025లోనే అంటూ రకరకాల పుకార్లు వస్తున్నాయి.

దీంతో అక్కినేని ఫ్యాన్స్‌ తండేల్‌ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సందేహాలన్నింటికి చెక్ పెట్టేందుకు రెడీ అయ్యింది మూవీ టీం. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మూవీ రిలీజ్‌పై క్లారిటీ రానుంది. ఈ మేరకు స్వయంగా మూవీ టీం ఓ వీడియో రిలీజ్‌ చేసింది. ఇందులో నిర్మాత ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ.. “అంతా తండేల్‌ మూవీ రిలీజ్‌ ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్నారు. సంక్రాంతికి వస్తామా? శివరాత్రికి వస్తామా? ఉగాది వస్తామా? ఎప్పుడు వచ్చినా కానీ దుళ్లగోట్టేస్తామంటూ” చెప్పిన వీడియోతో సర్‌ప్రైజ్‌ చేశారు.

అన్ని సందేహలకు డిసెంబర్‌ 4న సాయంత్రం 5:04 గంటలకు క్లారిటీ ఇస్తామని పేర్కొన్నారు. దీంతో తండేల్‌ రిలీజ్‌పై నేటితో స్పష్టత రానుండటంతో ఆడియన్స్‌ అంతా క్యూరియసిటీతో ఉన్నారు. కాగా 2018లో గుజరాత్‌ జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కుతుంది. దేశభక్తి అంశాలతో నిండిన రా అండ్‌ రస్టిక్‌ లవ్‌స్టోరీగా తండేల్‌ రూపొందుతోంది. చై ఇందులో రాజు అనే మత్స్యకారుడిగా కనిపించనున్నాడు. అతడి కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రం. దాదాపు రూ. 40 కోట్ల వ్యయంతో సినిమాను తెరకెక్కించారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న తండేల్‌ తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, మలయాళ, కన్నడ భాషలో విడుదల కానుంది.

Exit mobile version