Site icon Prime9

Naga Chaitanya: నాగ చైతన్య బర్త్‌డే సర్‌ప్రైజ్‌ – ‘విరూపాక్ష’ డైరెక్టర్‌తో చై నెక్ట్స్‌ మూవీ

Naga Chaitanya NC24 Announcement: యువసామ్రాట్‌ నాగచైతన్య పుట్టిన రోజు నేడు. నవంబర్‌ 23న నాగచైతన్య బర్త్‌డే. ఈ సందర్భంగా అతడికి ఇండస్ట్రీకి ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అలాగే చై పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్‌ ఒక్కటి బయటకు వచ్చింది. ప్రస్తుతం నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వంలో తండేల్‌ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఇది శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తండేల్‌ రిలీజ్‌ కానుంది. అయితే అప్పుడే చై మరో సినిమాకు లైన్లో పెట్టాడు.

‘విరూపాక్ష’ ఫేం కార్తీక్‌ దండుతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇవాళ చై బర్త్‌డే సందర్భంగా తాజాగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఇది నాగచైతన్యకు 24 సినిమా. ఈ మేరకు NC24 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ప్రీలుక్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ఇంకెప్పుడు లేనంత లోతుకు అతడు వెళ్లాడు అంటూ ప్రీలుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. చూస్తుంటే ఇదోక మిస్టరీ థ్రిల్లర్‌ అని అర్థమవుతుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలపై ఈ సినిమా రూపొందనుంది. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

కాగా సుకుమార్‌ శిష్యుడైన కార్తీక్‌ దండు డైరెక్టర్‌గా తెరకెక్కించిన చిత్రం ‘విరూపాక్ష’. సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్‌, సంయుక్త మీనన్‌లు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసి రికార్డు సృష్టిచింది. ఈ సినిమా తర్వాత కార్తీక్‌ దండు నాగచైతన్యతో సినిమాను ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం కార్తీక్ దండు స్క్రిప్ట్‌ డెవలప్‌ చేసే పనిలో ఉన్నాడు. మరోవైపు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ని కూడా జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మూవీ టీం వెల్లడించనుంది.

Exit mobile version