Site icon Prime9

Chengalamma Temple: చెంగాళమ్మ సన్నిధిలో పురపాలక రీజనల్ డైరెక్టర్

Municipal Regional Director in presence of Chengalamma Sannidhi

Municipal Regional Director in presence of Chengalamma Sannidhi

Sullurpet: తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న తెలుగు, తమిళుల ఆరాధ్య దేవత శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకొన్నారు.

ఆలయం వద్ద ఆయనకు ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు రెడ్డిలు ఘన స్వాగతం పలికారు. పురోహితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రదిక్షిణల అనంతరం గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం శ్రీనివాసరావు దంపతులను శాలువతో సత్కరించి తీర్ధ ప్రసాదాలను అందచేశారు. ఆలయ విశిష్టతను వివరించారు.

కార్యక్రమంలో వారివెంట పురపాలక సంఘ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: CM KCR: మరగుజ్జులు మహాత్ములు కాలేరు….సీఎం కేసిఆర్

Exit mobile version